ఫైట‌ర్ క‌థ‌కి ‘నో’ చెప్పిన బ‌న్నీ

ఇండ్ర‌స్ట్రీలో ఓ హీరో కాద‌న్న క‌థ మ‌రొక‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం చాలా కామ‌న్‌. హీరో – ద‌ర్శకుడి మ‌ధ్య జ‌రిగే డిస్క‌ర్ష‌న్స్ లో ఎన్నో క‌థ‌లు పుడుతుంటాయి. ప్ర‌తీ క‌థా ప‌ట్టాలెక్కాల‌న్న నియ‌మం లేదు. ఇప్పుడు పూరి జ‌గ‌న్నాథ్ – విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అదే.. ‘ఫైట‌ర్‌’. నిజానికి ఈ క‌థ‌కు తొలి హీరో విజ‌య్ కాదు. అల్లు అర్జున్‌.

‘దేశ‌ముదురు’ త‌ర‌వాత బ‌న్నీ – పూరి క‌ల‌సి ప‌నిచేద్దామ‌నుకున్నారు. వాళ్ల‌ద్ద‌రి డిస్క‌ర్ష‌న్స్ మ‌ధ్య చాలా క‌థ‌లు న‌డిచాయి. వాటిలో ‘ఫైట‌ర్‌’ కూడా ఒక‌టి. కానీ.. బ‌న్నీ ఈ క‌థ‌కు `నో` చెప్పాడు. ఆ త‌ర‌వాత `ఇద్ద‌ర‌మ్మాయిల‌తో` సెట్ అయ్యింది. బ‌న్నీ నో చెప్పాక ఆ క‌థ‌ని ప‌క్క‌న పెట్టేశాడు పూరి. దానికి కొన్ని మెరుగులు దిద్ది త‌న‌యుడు ఆకాష్ తో సైతం తీద్దామ‌నుకున్నాడు. చివ‌రికి అది విజయ్‌కి ఓకే అయ్యింది. అదేంటో.. పెద్ద హీరోలు ప‌క్క‌న పెట్టిన క‌థ‌లు చాలా వ‌ర‌కూ హిట్ అయ్యాయి. మ‌రి ఈ సినిమా ఏమ‌వుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close