రేవంత్‌, లోకేశ్‌ ఫ్యాక్టర్‌లే ప్రధాన కారణం!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లడానికి తనకు బాధగా ఉన్నదంటూ ఎర్రబెల్లి దయాకర్‌రావు చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. చంద్రబాబునాయుడు అంటే తనకు ఇప్పటికీ ఇష్టమే ఉన్నదని.. ఆయన మంచి నాయకుడు అని, కానీ తాను కొన్ని ఇబ్బందుల వల్ల తెరాసలోకి వెళ్తున్నానని వెల్లడించారు. తెదేపాను వీడి వెళ్లడం చాలా బాధగా ఉన్నదని, ఇక రాష్ట్రంలో తెదేపా బతకదని ఆయన వెల్లడించారు. ఈ మాటల ఆధారంగానే ఇప్పుడు కొత్త విశ్లేషణలు ప్రారంభం అవుతున్నాయి.

తెదేపా అంటే అంతగా అభిమానం ఉన్న వ్యక్తి… అంతగా బాధపడుతూ పార్టీని వీడిపోవాల్సిన అవసరం ఏమిటి? ఇది సహజంగా అందరికీ కలిగే సందేహం. అయితే నారా చంద్రబాబునాయుడు- తన కొడుకు లోకేశ్‌కు, రేవంత్‌రెడ్డికి అనుచితమైన ప్రాధాన్యం ఇస్తుండడమే ఎర్రబెల్లి తన ‘ఎగ్జిట్‌’ రంగం సిద్ధం చేసుకోవడానికి ప్రధాన కారణం అని పలువురు విశ్లేషిస్తున్నారు.

రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావుల మధ్య తెలుగుదేశం పార్టీలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణమే ఉంది. వీరిద్దరూ ఒకరిని ఉద్దేశించి మరొకరు ఇండైరక్టుగా బహిరంగ వేదికల మీదనే సెటైర్లు వేసుకోవడం.. పార్టీని ఒక రకంగా చెప్పాలంటే రచ్చకీడ్చడం జరుగుతూ వచ్చింది. ఎర్రబెల్లి తెరాస అనుకూల తెదేపా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడంటూ రేవంత్‌ ప్రెవేటు సంభాషణల్లో వ్యాఖ్యానించడం కూడా జరిగింది. రేవంత్‌ దూకుడును కూడా ఎర్రబెల్లి పలు సందర్భాల్లో ఖండించడమూ మామూలైపోయింది.

అదే సమయంలో, పార్టీలో ఇంకా బొడ్డూడని నాయకుడు అయిన నారా లోకేష్‌ నేతృత్వంలో తమలాంటి సీనియర్లను పనిచేయాల్సిందిగా అధినేత చంద్రబాబు నిర్దేశించడం కూడా ఎర్రబెల్లికి రుచించలేదని సమాచారం. లోకేష్‌ నాయకత్వం బలపడిన నాటినుంచి ఎర్రబెల్లి అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును ఆయనే స్వయంగా హైకోర్టులో వేసారు గనుక.. ఆ అంశం తప్ప మరొక దానితో తనకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతూ వచ్చారు. లోకేశ్‌ పెత్తనం భరించలేకపోతున్నట్లున ఆయన వర్గీయులు చెప్పే వారు.

మొత్తానికి ఇన్నాళ్లకు వ్యవహారాలు అన్నీ ఒక కొలిక్కి వచ్చేయి. గ్రేటర్‌లో ఓటమి పర్వాన్ని కూడా పూర్తిగా చూసిన తర్వాత.. ఇప్పుడు ఆయన పార్టీ మారారు. తెలంగాణలో ఇక తెలుగుదేశం పార్టీ బతకడం సాధ్యం కాదంటున్న ఎర్రబెల్లి.. ఇన్నాళ్లూ పార్టీ డైరెక్షన్‌ ప్రకారమే తెరాస పార్టీని, కేసీఆర్‌ను విమర్శించానని అంటున్నారు. మొత్తానికి కొందరు నాయకులకు పార్టీలో పెద్దపీట వేయడం అనేది.. మరికొందరు పార్టీని వెళ్లడానికి ప్రేరణ అయినట్లుగా కనిపిస్తున్నది. కాకపోతే.. ఎర్రబెల్లి చెప్పినట్లుగా ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తెదేపాను వీడి పోతున్నట్లయితే,… వారు ఎవరు? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close