ఆస్కార్‌పై రాజ‌మౌళి సంచ‌ల‌న వ్యాఖ్యలు

ఆస్కార్ విన్నింగ్ చిత్రం `పార‌సైట్‌` న‌చ్చ‌లేదంటూ రాజ‌మౌళి చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల స్పంద‌న‌లు వినిపిస్తున్నాయి. అది ఆయ‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయం అని కొంద‌రంటే, ఆస్కార్ స్థాయినే రాజ‌మౌళి ప్ర‌శ్నిస్తున్నాడా? అంటూ కొంత‌మంది విమ‌ర్శ‌నా బాణాలు సంధించారు. ఈలోగా ఆస్కార్ అవార్డుల‌పై మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశాడు రాజ‌మౌళి.

“పార‌సైట్ నాకు న‌చ్చ‌క‌పోవ‌డ‌మ‌నేది నా వ్య‌క్తిగ‌త అభిరుచి. జ్యూరీ ప్ర‌మాణాలంటారా, అక్క‌డ కూడా లాబీయింగ్ ఉంటుంది. ఓ సినిమా జ్యూరీ స‌భ్యులు చూడాలంటే చాలా త‌తంగ‌మే న‌డుస్తుంది“ అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాజ‌మౌళి. అయినా స‌రే.. జ్యూరీ ప్ర‌మాణాల్ని పాటిస్తుంటుంద‌ని ప్ర‌పంచం మొత్తం న‌మ్ముతుంద‌ని, ఓ చెత్త సినిమాకు అవార్డు ఇచ్చే ప‌రిస్థితి ఉండ‌ద‌ని, గ‌తంలోనూ ఆస్కార్ సాధించిన చాలా సినిమాలు త‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పుకొచ్చాడు. ఆస్కార్‌పైనే కాదు, అవార్డు విన్నింగ్ సినిమాల‌న్నింటిపైనా ఇలాంటి విమ‌ర్శ‌లు, అభిప్రాయాలే వ్య‌క్తం అవుతుంటాయి. అవార్డు సినిమా అంటే బోరింగ్ సినిమానే అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఆస్కార్ అందుకు అతీతం కాదు. మ‌రి తాజాగా ఆస్కార్‌పై రాజ‌మౌళి చేసిన ఈ వ్యాఖ్య‌లు ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ రోడ్ షోలతో కూటమికి మరింత ఊపు !

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ నిర్వహించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి...

ఎలక్షన్ ఎజెండా డిసైడ్ చేసిన రేవంత్ రెడ్డి

ఎన్నికలకు ఎజెండా డిసైడ్ చేసే పార్టీకే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అలాంటి అజెండా డిసైడ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఈ విషయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ముస్లిం రిజర్వేషన్ల...

కేసీఆర్ చెప్తున్న ఆ వ్యాఖ్యలను నమ్మి జనం ఓటేస్తారా..?

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులు పదేపదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా ఇదే రొటీన్ డైలాగ్ లా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో...

పెద్దిరెడ్డి విశ్వరూపం – వాడిపోతున్న రోజా !

నగరి వైసీపీలో ఐదు మండలాల ఇంచార్జ్‌లతో పాటు ఇతర నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. రోజాను ఘోరంగా ఓడించి .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close