లాక్ డౌన్ 4.0.. సినిమాకి మ‌ళ్లీ మొండి చేయి!

లాక్ డౌన్ 4.0 చాలా స‌డ‌లింపుల‌తో, ప్ర‌త్యేక ప్యాకేజీల‌తో వ‌స్తోంది. కేంద్రం బోలెడ‌న్ని మిన‌హాయింపుల్ని ప్ర‌క‌టించ‌బోతోంది. వాటితో థియేట‌ర్లు తెర‌చుకోవ‌డానికి అవ‌కాశం ల‌భిస్తుంద‌ని ఆశ ప‌డ్డారు నిర్మాత‌లు, పంపిణీదారులు. అయితే… ఈసారీ సినిమాకి మొండిచేయ్యే ఎదురుకానున్న‌ద‌ని స‌మాచారం. స్కూళ్లు, థియేట‌ర్లు, షాపింగ్ మాల్స్‌కి మాత్రం ఈ లాక్ డౌన్‌లోనూ అనుమ‌తుల్లేవ‌ని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ‌ల్లో థియేట‌ర్లు తెర‌చుకోనున్నాయ‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది. కానీ కేంద్ర ప్ర‌భుత్వ మార్గ ద‌ర్శ‌కాల్లో, ప్ర‌భుత్వం ఇచ్చే మిన‌హాయింపుల్లో థియేట‌ర్ల‌కు ఛాన్సు లేద‌ని తెలుస్తోంది. అయితే షూటింగుల‌కు అనుమ‌తి ఇచ్చే అవకాశం ఉంది. కానీ.. అవి కూడా చాలా నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు లోబ‌డి జ‌ర‌గాలి. ఆ మార్గ‌ద‌ర్శ‌కాల్ని పాటించి షూటింగులు చేయ‌డం చాలా క‌ష్టం. జూన్ చివ‌రి వ‌ర‌కూ థియేట‌ర్ల రీ ఓపెనింగ్‌కి అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. వీటిపై ఆశ‌లు పెంచుకున్న నిర్మాత‌లు ఇప్పుడు ప్ర‌త్యామ్నాయ మార్గాల్ని వెదుక్కోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close