చైతన్య : ఏపీలో అన్ని శాఖలకూ అందరూ మంత్రులే..!

సాధారణంగా ప్రభుత్వం అంటే.. ముఖ్యమంత్రి..మంత్రులు. మంత్రులకు ఎవరి శాఖలు వారికి ఉంటాయి. వారి వారి శాఖలపై వారు సమీక్షలు చేస్తారు. సమస్యలు వచ్చినప్పుడు వారే స్పందిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరు మాత్రం భిన్నం. ఏ శాఖ మంత్రి అయినా … అన్నింటిపై స్పందిస్తారు. తనకు సంబంధం లేని శాఖలపై ప్రెస్‌మీట్ పెట్టి ఎడాపెడా ప్రసంగించేస్తారు. సంబంధిత శాఖ మంత్రి మాత్రం జాడ ఉండరు. అన్నింటితో పాటు కరెంట్ బిల్లుల విషయంలోనూ అదే జరిగింది.

ఎవరి శాఖపై వారు మాత్రం ప్రెస్‌మీట్ పెట్టకపోవడం ఏపీ మంత్రుల స్టైల్..!

విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. కరెంట్ బిల్లుల విషయంలో చాలా రచ్చ జరుగుతోంది. కానీ ఆయన నిన్న తాపీగా రెండు ముక్కలు మాట్లాడారు కానీ అసలు కరెంట్ బిల్లులు కరెక్ట్‌గానే ఉన్నాయని బ్యాటింగ్ చేస్తోంది మాత్రం ఇతర మంత్రులు. బుగ్గన, కన్నబాబు, హోంమంత్రి సుచరిత లాంటి వాళ్లు రోజూ వివరణ ఇస్తున్నారు. పనిలో పడి తమ శాఖ ఏదో మంత్రులు మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రులకు తాము ఏ శాఖల మంత్రులమో.. గుర్తు లేనట్లుగా..ఇతరుల మంత్రిత్వ శాఖల్లోని అంశాలను.. విశదీకరిస్తూ ఉంటారు. మీడియాలకు గంటల తరబడి ఇంటర్యూలు ఇస్తూ కనిపిస్తున్నారు. కరోనా వ్యవహారాన్ని డీల్ చేయాల్సిన మంత్రి ఎవరు…? ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్. ఆయన దీని గురించి చాలా తక్కువ మాట్లాడతారు. కానీ.. వ్యవసాయ మంత్రి కన్నబాబు.. దగ్గర్నుంచి సీనియర్లం అనుకునే అందరూ ఈ బాధ్యత తీసుకుని మీడియా ముందు డిఫెండ్ చేస్తారు. తమ శాఖే అన్నంతగా ఇన్వాల్వ్ అయిపోతారు. అసలు మంత్రి మాత్రం.. ఓ సారి ప్రెస్‌మీట్ పెట్టి… హడావుడిగా వెళ్లిపోతారు.

అందరూ అన్ని శాఖలపై అవగాహన పెంచేసుకుంటున్నారా..?

సిట్యూయేషన్ డిమాండ్ చేస్తోంది.. సీనియర్లుగా ఆ బాధ్యతలు పంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి.. తమ సీనియార్టీ మేరకు బాధ్యత తీసుకున్నారని అనుకుందాం. కానీ.. ఇతర మంత్రిత్వ శాఖల్లోనూ అదే పరిస్థితి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి… పంచాయతీరాజ్ చట్టం గురించి అనర్గళంగా ప్రసంగిస్తారు. స్థానిక ఎన్నికల గురించి చెప్పాలి.. అంటే… పంచాయతీరాజ్ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పాలి. కానీ విశాఖ… లేదా విజయనగరంలో ప్రెస్‌మీట్లు పెట్టి… ఆర్థిక అంశాలు.. వ్యవసాయ అంశాలపై ప్రకటనలు చేస్తూ ఉంటారు. రైతులు ఎవరూ ఇబ్బంది పడటం లేదని.. దమ్ముంటే..తనతో వచ్చి చూపించాలని బొత్స సవాల్ చేస్తూ ఉంటారు. వ్యవసాయ మంత్రి ఆ చాలెంజ్ చేస్తే… యాప్ట్‌గా ఉండేది. ఇది మాత్రమే కాదు.. రేషన్ పంపిణీ విషయంలోనూ రచ్చ జరిగింది. పౌరసరఫరాల శాఖ మంత్రి వివరణ ఇవ్వాల్సి ఉంది. సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని బాధ్యత తీసుకున్నారు. మచిలీపట్నంలో ఇంటింటి రేషన్ పంపిణీ ప్రయోగాత్మకంగా చేపట్టామని… త్వరలో రాష్ట్రమంతటా విస్తరిస్తామని డిక్లేర్ చేశారు. అదేంటి…. ఆ ప్రకటన చేయాల్సింది .. పౌరసరఫరాల మంత్రి కదా అని డౌట అందరికీ వచ్చింది. కానీ సమాధానం అందరికీ తెలుసు.

మీడియా ముందు చెప్పమన్నది మాత్రమే మంత్రులు చెబుతున్నారా..?

ఏపీ సర్కార్‌లో మంత్రులు డమ్మీలనే ప్రచారం ఉంది. వారు ఏం మాట్లాడాలి.. ఎప్పుడు మాట్లాడాలన్నది నోట్ రూపంలో వస్తుంది..మాట్లాడతారని అంటారు. ఆయా మంత్రులకు పదవులు.. పదవులకు మాత్రమే. వారు చేసేదేమీ ఉండదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వానికి కొంత మంది సలహాదారులు ఉన్నారు. వారే అనధికారిక పాలకులు. ఇద్దరు ముగ్గురు సలహాదారులు చాలా యాక్టివ్ గా ఉంటారు. మొత్తం వ్యవహారాలన్నీ వాళ్లే చక్కబెడతారని.. సెక్రటేరియట్‌లో ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ సైడ్ ఎపెక్టే ఇది కావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close