31 వరకు లాక్‌డౌన్‌.. ఇవీ కొత్త గైడ్ లైన్స్

దేశంలో లాక్‌డౌన్‌ను..ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగిస్తూ..కేంద్రం నిర్ణయం ప్రకటించింది. అయితే.. పెద్ద ఎత్తున మినహాయింపులు ఇచ్చింది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర బస్సు, క్యాబ్ సర్వీసులకు అనుమతి ఇచ్చింది. అయితే.. ఇది రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారపూర్వకంగా ఉండాలని స్పష్టం చేసింది. రైళ్లు మాత్రం ప్రకటించిన ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. అలాగే హోటళ్లు తెరిచేందుకు అంగీకరించలేదు కానీ.. హోండెలివరీకి మాత్రం.. మినహాయింపులు ఇచ్చింది. ప్రత్యేకంగా వేటికి అనుమతి లేదో..చెబుతూ.. ఓ వివరణ పత్రం విడుదల చేసింది.

డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కు అనుమతి లేదు ..కానీ ఎయిర్‌ అంబులెన్స్‌లు, భద్రతకు సంబంధించినవి, ఎంఏహెచ్‌ అనుమతించిన వాటికి మినహాయింపు ఉంటుంది. మెట్రో రైళ్లు నడపరు. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరవడానికి అవకాశం లేదు. హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి లేదు కానీ..అత్యవసర సేవలందించే వారికి ఆహారం అందించే వంట శాళలకు మాత్రంఅనుమతి ఉంటుది. హోం డెలివరీ కూడా చేసుకోవచ్చు. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, రాజకీయ, సామాజిక, క్రీడా మతపరమైన సంస్థల్లో ప్రజలకు అనుమతి లేదు. మతపరమైన కార్యక్రమాలకు అనుమతి లేదు.

అన్ని రకాల సరుకు రవాణాకు.. కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ఖాళీ ట్రక్కులు కూడా తిరగొచ్చని .. ఎలాంటి అనుమతులు అక్కర్లేదని కేంద్రం తేల్చింది. అన్ని రకాల సరుకుల రవాణాకు అనుమతి లభించడంతో ఈ కామర్స్ సంస్థలు కూడా పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మాల్స్.. హోటల్స్ లాంటి వాటి ప్రారంభానికి అనుమతి ఇస్తారని చాలా మంది అంచనా వేశారు కానీ.. దేశంలో కేసులు అంతకంతకూ పెరుగుతూండటంతో రిస్క్ తీసుకోదల్చుకోలేదని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలు పలు రకాల మినహాయింపులు ఇచ్చాయి. ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా.. రాష్ట్రాలు ఇప్పటికే కొన్ని చర్యలు ప్రకటించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

పాతబస్తీలో తగ్గిన పోలింగ్… టెన్షన్ లో అసద్..!?

హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయంపై ఎంఐఎం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ కేవలం 46.08శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో మజ్లిస్ కంచుకోటలో బీజేపీ పాగా వేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close