“జియో”పై మనసుపడిన అమెరికన్ ఈక్విటీ సంస్థలు..!

రిలయన్స్ జియో ఫ్లాట్ ఫామ్స్ పంట పండుతోంది. ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ ఏమైపోతోందోనని.. అందరూ కంగారు పడుతూంటే.. ముఖేష్ అంబానీ జియో మాత్రం… పెట్టుబడులతో పవర్ ఫుల్‌గా మారుతోంది. ఒక్కశాతం వాటా అమ్మితేనే వేల కోట్లు వచ్చి పడుతున్నాయి. కొత్తగా అమెరికాకు చెందిన ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ రూ.6,598 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇంత పెద్ద మొత్తం పెట్టినందుకు ఆ సంస్థకు వచ్చిన వాటా 1.34 శాతం మాత్రమే. జియో ఫ్లాట్ ఫామ్స్‌కి ఇదే మొదటి పెట్టుబడి కాదు. గత నెల రోజుల్లో ఈ సంస్థకు.. రూ.67,195 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఫేస్‌బుక్..రూ.43,574 కోట్లతో 9.99శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ సంచలనం సృష్టింంచింది.

లాక్ డౌన్ దెబ్బకు కుదలైన ముఖేష్ అంబానీ సంపద ఈ డీల్‌తో అనూహ్యంగా పెరిగిపోయింది. ఆ తర్వాత సిల్వర్ లేక్ పార్టనర్స్ అనే అమెరికా సంస్థ 1.15 శాతం వాటా కొనుగోలుకి రూ. 5650 కోట్లు వెచ్చించింది. ఆ తర్వాత అమెరికాకే చెందిన మరో కంపెనీ విస్టా ఈక్విటీ పార్టనర్స్ 2.32శాతం వాటా కోసం రూ.11, 367కోట్లు వెచ్చించింది. మొత్తంగా 14.8 శాతం జియో ఫ్లాట్ ఫామ్ వాటాలు అమ్మేస్తే..వచ్చిన మొత్తం రూ.67,195 కోట్లు. ప్రస్తుతం జియో ఈక్విటీ వాల్యూ 4.91లక్షల కోట్లు కాగా..ఎంటర్ ప్రైజ్ వాల్యూ 5.16 లక్షల కోట్లు.

నిజానికి దేశంలో టెలికాం రంగం తీవ్రసంక్షోభంలో ఉంది. అయితే..జియో మాత్రమే సంచలనాలు సృష్టిస్తోంది. ఫేస్ బుక్ నేరుగా జియోతో కలిసి వ్యాపారం చేయడానికి పెట్టుబడి పెట్టగా.. మిగతా సంస్థలన్నీ…ఈక్విటీ సంస్థలు.. లాభాల కోసం పెట్టుబడులు పెడుతున్నాయి. పెద్ద మొత్తంలో వాటాలు అమ్మకుండానే వేల కోట్లు పెట్టుబడి రావడంతో జియో వాల్యూ కూడా అంతకంతకూ పెరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close