రంగుల జీవో రద్దు..! ఏపీ సర్కార్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు..!?

పంచాయతీ భవనాలకు.. ప్రభుత్వ భవనాలకు వేసిన వైసీపీ రంగుల విషయంలో హైకోర్టు మరోసారి ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పునిచ్చింది. వైసీపీ పార్టీకి చెందిన రంగులతో కాకుండా.. మరో మట్టి రంగు కలిపి నాలుగు రంగులు వేయాలని ఇచ్చిన జీవోను హైకోర్టు రద్దు చేసేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీల రంగులు ఉండకూడదని.. హైకోర్టు.. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా.. ఆ జీవో ఎందుకివ్వాల్సివచ్చిందో వివరణ ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ, చీఫ్ సెక్రటరీ, ఈసీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలోపు రంగులు తొలగించాలని.. వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభించాలని ధర్మానసం ఆదేశించింది.

ప్రభుత్వం రంగుల విషయంలో ఎవర్నీ లెక్క చేయనట్లుగా వ్యవహరిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ భవనాలపై వైసీపీ రంగులు వేశారు. దీనిపై హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాజ్యం దాఖలైంది. విచారణ జరిపిన హైకోర్టు రంగుల్ని తీసేయాలని ఆదేశాలిచ్చింది. అయితే.. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా.. రంగుల్ని తీసేయాలనే తీర్పు వచ్చింది. హైకోర్టు మూడు వారాల గడువు ఇచ్చి.. రంగులు తీసేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వం తీర్పులో ఉన్న సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకుని.. వైసీపీ పార్టీకి చెందిన మూడు రంగులను అలాగే ఉంచి.. పైన మరో రంగును వేయమని జీవో జారీ చేశారు.

ఒక్కో రంగుకు.. ఒక్కో అర్థం చెబుతూ.. ఆ రంగుల జీవోను ఇచ్చారు. దీనిపైనా హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందన్న అభిప్రాయానికి వచ్చింది. సుప్రీంకోర్టు చెప్పినా రంగులు తీయకుండా.. మొండిగా విచిత్ర వాదనలు చేస్తూ.. జీవోలు జారీ చేయడంపై.. న్యాయవర్గాల్లోనే మొదటి నుంచి ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇప్పుడు.. సీఎస్, పంచాయతీరాజ్ శాఖ, ఈసీ మెడకు.. ఈ జీవోలు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. కోర్టు ధిక్కరణ ప్రక్రియ కూడా ప్రారంభించారని హైకోర్టు ఆదేశించడంతో… ఖచ్చితంగా కొంత మంది కీలక అధికారులకు ఇబ్బందులు తప్పవని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

ఓటేస్తున్నారా ? : పోలవరం వైపు ఓ సారి చూడండి !

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కరువులో నిండా మునిగిపోవాలో.. కనీసం రైతుల కడుపు నింపుకోవాలో తేల్చుకోవాల్సిన సంధి స్థితిలో ఉంది. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. గతంలో ఓట్లు వేశారు. ఐదేళ్లలో ఏం...

ఏది నైతికత… ఏది అనైతికత ..!?

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న...

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close