“హెర్డ్ ఇమ్యూనిటీ” కోసమే అన్‌లాక్ వ్యూహం..?

దేశంలో కరోనా వైరస్ కేసులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు… సరి కదా.. ప్రతీ రోజూ.. సరికొత్త రికార్డుకు చేరువు అవుతున్నాయి. అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దేశలంలో సింగిల్ డే ఏడు వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాల్లోనూ ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం… అన్ లాక్ ప్రక్రియ ప్రారంభించింది. మాల్స్ సహా అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా ప్రారంభించుకోవడానికి ఓకే చెప్పింది. అతి తక్కువ కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ విధించి.. ఇప్పుడు నిబంధనలు సడలించడంపై చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది కానీ.. కేంద్రం మాత్రం… తమైదన వ్యూహంతో వెళ్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కరోనాను తరిమికొట్టడం అసాధ్యమని తేలిపోయింది. ఎంత కట్టడి చేసినా వ్యాపిస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో… ఆ కరోనాను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడం తప్ప.. చేయగలిగిందేమీ లేదనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దానికి ఉన్న మార్గం హెర్డ్ ఇమ్యూనిటీ. సామూహికంగా రోగ నిరోధక శక్తి పెంచుకోగలిగితే.. వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది., ఇప్పటికే బ్రిటన్, స్వీడన్ లాంటిదేశాలు ఈ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ విషయాన్ని నేరుగా చెబితే అనేక విమర్శలు వస్తాయి. ప్రజల్ని కరోనాకు వదిలి పెట్టేస్తున్నారా.. అని విపక్షాలు ప్రశ్నిస్తాయి. అందుకే.. హెర్డ్ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా కాకుండా.. నిబంధనలు ఎత్తివేత ద్వారా.. మరో మార్గం.. ఆ ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

అన్‌లాక్ నిబంధనల్లో అత్యంత కీలకమైనది చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రాకపోవడం. వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి.. కరోనా నుంచి కాపాడుకోవడం కష్టమవుతుంది. అందుకే.. వారు బయటకు రాకూడదని..నిబంధనలు విధించారు. యువతకు.. కరోనాను తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. అందుకే.. కరోనా సోకినట్లుగా బయటపడిన వారిలో … 70, 80 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదు. చాలా మందికి.. కరోనా సోకి తగ్గిపోయి ఉంటుందనే అంచాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని కంటెయిన్మెంట్ జోన్లలో ఐసీఎంఆర్ ప్రత్యేక పరీక్షలు చేసింది. పెద్ద ఎత్తున శాంపిళ్లను సేకరించింది. ఈ ఫలితాలతో కరోనా ఎంత మందికి సోకి నయమయిందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా వెళ్తున్నామో లేదో కూడా తెలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం కోల్పోయినా సరే కానీ… జగన్ టార్గెట్ అదే..!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ ఓటమి లక్ష్యంగా వైసీపీ...

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close