హీరోయిన్ కోసం బాల‌య్య డిమాండ్

నంద‌మూరి బాల‌కృష్ణ – బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. క‌థానాయిక‌గా ఓ కొత్త‌మ్మాయిని ఎంచుకోవాల‌న్న‌ది బోయ‌పాటి ప్లాన్‌. అందుకోసం అన్వేష‌ణ కూడా జ‌రుగుతోంది. బొంబై నుంచి ఓ కొత్త క‌థానాయిక‌ని దిగుమ‌తి చేయాల‌ని భావిస్తున్నారు.

కానీ బాల‌య్య మాత్రం స్టార్ హీరోయిన్‌ని డిమాండ్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. కొత్త‌మ్మాయిలు వ‌ద్దు.. స్టార్ నాయిక అయితే బాగుంటుంద‌ని చిత్ర‌బృందానికి బాల‌య్య సూచించాడ‌ట‌. బాల‌య్య మాటంటే తిరుగు ఉంటుందా..? ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు కొత్త హీరోయిన్ బ‌దులు స్టార్ హీరోయిన్ ని ఎంచుకోవాల‌ని డిసైడ్ అయ్యారు. నిజానికి ఈ స్క్రిప్టు మొద‌లెట్టేట‌ప్పుడు స్టార్ హీరోయిన్‌ని తీసుకుందామ‌నుకున్నారు. కానీ… బ‌డ్జెట్ త‌గ్గిద్దామ‌ని కొత్త హీరోయిన్‌తో స‌రిపెట్టాల‌నుకున్నారు. ఇప్పుడు ప్లాన్ రివ‌ర్స్ అయ్యింది. త్వ‌ర‌లోనే హీరోయిన్ విష‌యంలో ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

ఫ్లాష్ బ్యాక్‌: ఏఎన్నార్ డూప్ టూ‌ మూవీ మొఘ‌ల్‌!

1958 నాటి రోజులు. కారంచేడు అనే ఓ ఊరిలో 'న‌మ్మిన బంటు' సినిమా తీస్తున్నారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరో. ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌కుడు. ఊర్లో షూటింగ్ అంటే మామూలుగా ఉండేదా? ఆ హ‌డావుడే...

HOT NEWS

[X] Close
[X] Close