మ‌హేష్‌.. అమెరికా షెడ్యూల్ లేపేశాడా?

క‌రోనా వ‌ల్ల క‌థ‌లు మార్చుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. గ్రూపు డాన్సులు లేవు. లిప్ లాక్కులు డౌటే. ఫారెన్ షెడ్యూళ్లు.. పూర్తిగా ప‌క్క‌న పెట్టాల్సిందే. స్క్రిప్టులో అలాంటి అవ‌కాశాలు లేకుండా చూసుకోవ‌డం ద‌ర్శ‌కుల ప్రాధ‌మిక బాధ్య‌త అయిపోయింది. `స‌ర్కారు వారి పాట‌` కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు.

మ‌హేష్ బాబు – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఈ స్క్కిప్టుని ఇప్ప‌టికే చాలా సార్లు మార్చాడు ప‌ర‌శురామ్. క‌రోనా వ‌ల్ల ఇప్పుడు ఇంకోసారి మారింది. క‌థ ప్ర‌కారం.. కొంత‌భాగం అమెరికాలో షూటింగ్ జ‌ర‌గాలి. నిజానికి ఆ షెడ్యూలే చాలా కీల‌కం. ఓ బ్యాంకు ద‌గ్గ‌ర వంద‌ల కోట్లు అప్పు చేసి విదేశాల‌కు పారిపోతాడు విల‌న్‌. అలాంటి విల‌న్‌ని ఇండియాకి ర‌ప్పించి, అప్పు వ‌సూలు చేయిస్తాడు హీరో. క‌నీసం 40 శాతం షూటింగ్ అమెరికాలో జ‌ర‌గాలి. ఇప్పుడు ఆ స‌న్నివేశాల్ని మార్చుకుని రాసుకోవాల్సివ‌చ్చింది. కొత్త స్క్రిప్టు ప్ర‌కారం షూటింగ్ అంతా ఇండియాలోనే జ‌ర‌గ‌బోతోంది. మ‌హేష్ స‌ల‌హాతోనే ఫారెన్ షెడ్యూల్ మొత్తం లేపేశార‌ని, దానికి త‌గ్గ‌ట్టు ఇండియాలోనే ఆ భాగాన్ని తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం. మ‌హేష్‌సినిమా అనే కాదు, మిగిలిన సినిమాలూ ఇప్పుడు ఇదే బాట ప‌డుతున్నాయి. ఇదంతా కరోనా ఎఫెక్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

గ్లాసంటే సైజు కాదు… సైన్యం

https://www.youtube.com/watch?v=oZYqzxtg4f8 ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకొంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయి రాజ‌కీయ నాయ‌కుడి అవ‌తారం ఎత్తాడు. ఆయ‌న్నుంచి సినిమాల‌కు సంబంధించిన అప్ డేట్లు మ‌రో రెండు మూడు నెల‌ల వ‌ర‌కూ రావు......

మీడియా వాచ్ : యూటర్న్‌లో కల్ట్ చూపిస్తున్న ఎన్టీవీ

ఎన్టీవీలోని అపరిచితుడు బయటకు వచ్చేశాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పై.. రేవంత్ రెడ్డిపై.. బీఆర్ఎస్ కు ఇష్టం లేని నేతలపై.. వాళ్ల టార్గెట్ ను రీచ్ ...

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close