చెర్రీ క‌థ‌లో.. శ‌ర్వా?

ఓ హీరో వ‌దిలేసిన క‌థ మ‌రో హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం కామ‌నే. అలా ఒక‌ప్పుడు రామ్ చ‌ర‌ణ్ వ‌దిలేసిన క‌థ‌.. ఇప్పుడు శ‌ర్వానంద్ చేతికి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. రామ్ చ‌ర‌ణ్ కోసం యూవీ క్రియేష‌న్స్ ఓ క‌థ‌ని త‌యారు చేసింది. శ‌ర్వా, చ‌ర‌ణ్‌ల స్నేహితుడు శ్రీ‌రామ్ రెడ్డి ఈ క‌థ‌ను త‌యారు చేశాడు. స్క్రిప్టు పూర్త‌య్యింది. చ‌ర‌ణ్‌కి న‌చ్చ‌లేదో, లేదంటే.. కుద‌ర్లేదో తెలీదు గానీ, ఆ కథ‌ని పక్క‌న పెట్టేశారు. ఇప్పుడు ఆ క‌థ‌ని శ‌ర్వాతో చేయాల‌ని యూవీ భావిస్తోంది. యూవీ అంటే ఓ ర‌కంగా శ‌ర్వా సొంత సంస్థ లాంటిది. అందుకే… ఈ సినిమా సెట్స్‌పై వెళ్ల‌డానికి మార్గం సుగ‌మం అయ్యింద‌ని తెలుస్తోంది.

అయితే శ‌ర్వా ఇప్పుడు ఫుల్ బీజీ. చేతిలో ‘శ్రీ‌కారం’ సినిమా వుంది. ‘మ‌హా స‌ముద్రం’ కూడా ఒప్పుకున్నాడు. కిషోర్‌తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాలి. వాటి మ‌ధ్య కొత్త ద‌ర్శ‌కుడికి ఛాన్స్ ఇవ్వాలి. మ‌హాస‌ముద్రంకీ కిషోర్ తిరుమ‌ల సినిమాకీ మధ్య యూవీ క్రియేష‌న్స్ సినిమా ప‌ట్టాలెక్కించే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

మదర్స్ డే @ 200 సంవత్సరాలు

ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారని మనకు తెలుసు.. అయితే ఈ ప్రతిపాదన మొదలై 200 సంవత్సరాలు అయిందనే విషయం మీకు తెలుసా? వాస్తవానికి 'మదర్స్ డే వేడుకలు'...

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close