మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా మ‌ర్చిపోయారు. కీర్తి, సాయి ప‌ల్ల‌వి మ్యాజిక్‌లో ప‌డి తేలుతున్నారు. అయిన‌ప్పటికీ అడ‌పా ద‌డ‌పా నిత్య‌కు అవ‌కాశాలు వ‌స్తూనే ఉన్నాయి. కానీ త‌నే స‌రైన రీతిలో వాటిని అందిపుచ్చుకోలేక‌పోతోంది. కీర్తి సురేష్ చేసిన `మ‌హాన‌టి`కి మొద‌టి ఆప్ష‌న్ నిత్య‌మీన‌నే. కానీ ఎందుకో ఆ సినిమాని వ‌దులుకోవాల్సివ‌చ్చింది.

ఇప్పుడు మ‌రో బ‌యోపిక్‌ని కాద‌నుకుంది నిత్య‌. ఒలింపిక్స్‌లో భార‌త‌దేశానికి తొలి ప‌త‌కం సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్ ఇప్పుడు ప‌ట్టాలెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ పాత్ర కోసం ఇటీవ‌ల నిత్య‌మీన‌న్‌ని సంప్ర‌దించార్ట ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఈ సినిమా చేయ‌డానికి నిత్య ఉత్సాహం చూపించ‌లేద‌ని తెలుస్తోంది. నిత్య ఈ మ‌ధ్య బాగా బ‌రువు పెరిగింది. అయితే క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి పాత్ర కోసం బ‌రువు త‌గ్గాలి. అలా బ‌రువు త‌గ్గ‌డం, మ‌ళ్లీ పెర‌గ‌డం నిత్య‌కు ఇష్టం లేద‌ట‌. అందుకే ఈ పాత్ర‌కు నో చెప్పేసింద‌ని టాక్‌. ఇప్పుడు మ‌ల్లీశ్వ‌రి పాత్ర కోసం ర‌కుల్ ప్రీత్ సింగ్‌ని ఎంచుకున్నారంటూ వార్త‌లొస్తున్నాయి. చివ‌రికి ఆ పాత్ర ఎవ‌రికి సెట్ అవుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close