తెలంగాణ సర్కారు మెడకు “సీక్రెట్ కరోనా మరణం”..!

కరోనా వైరస్‌ను డీల్ చేస్తున్న వ్యవహారంలో తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నుంచి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. టెస్టులు తక్కువ చేయడంపై ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయింది. ఇప్పుడు కొత్తగా కరోనా మరణం పేరుతో.. ఓ వ్యక్తిని కుటుంబానికి దూరం చేసిన వివాదం దుమారం రేపుతోంది. వనస్థలిపురానికి చెందిన మధుసూదన్‌ అనే వ్యక్తికి కరోనా సోకిందని ఏప్రిల్ నెలాఖరును గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పటి వరకూ ఆయన ఆచూకీ తెలియలేదు. కుటుంబ సభ్యులకూ ఏమయ్యారో చెప్పలేదు. చివరికి కుటుంబ సభ్యులు.. మధుసూదన్ గురించి అడిగితే.. గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మే 1న చనిపోయాడని సమాచారం ఇచ్చారు. దీంతో వాళ్లు హతాశులయ్యారు.

మధుసూదన్ భార్య తన భర్త ఆచూకీ తెలియడం లేదని మే 21న ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు చనిపోయారని చెబుతున్నారని.. చనిపోతే డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదని మాధవి ప్రశ్నించారు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా మధుసూదన్ అంత్యక్రియలు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ఈ వివాదంపై మంత్రి ఈటల కూడా స్పందించి వివరణ ఇచ్చారు. వారి కుటుంబం షాక్‌కు గురి కాకూడదనే చెప్పలేదన్నారు. అంత్యక్రియలు జీహెచ్ఎంసీ సిబ్బందే చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని మధుసూదన్ భార్య హైకోర్టును ఆశ్రయించింది. హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

విచారణలో అసలు మధుసూదన్ బ్రతికి ఉన్నాడా? లేడా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. మధుసూదన్ కరోనాతో చనిపోయాడాని అడ్వకేటే జనరల్‌ కోర్టుకు తెలిపారు. మరి చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నించింది. అంత్యక్రియలు నిర్వహిస్తే దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలని ఆదేశించింది. కనీసం కుటుంబ సభ్యులకు కూడా ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.. పూర్తి వివరాలతో శుక్రవారంలోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close