పోలీసుల్ని దాటడమే టీ కాంగ్రెస్ నేతలకు పెద్ద సవాల్..!

తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజకీయం చేద్దామంటే సాధ్యం కావడం లేదు. వారు అడుగు బయటపెడితే పోలీసులు అడ్డుకుంటున్నారు. మొన్నటికి మొన్న కృష్ణా ప్రాజెక్టులపై దీక్ష చేస్తామంటే పోలీసులు హౌస్ అరెస్టులు చేసేశారు. సరే అప్పుడంటే.. లాక్ డౌన్ నిబంధనలు ఉన్నాయని పోలీసులు కారణం చెప్పారు. కానీ అన్నీ సడలింపులు ఇచ్చేసిన తర్వాత కరెంట్ బిల్లులు, నియంత్రిత వ్యవసాయ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించి..చలో సచివాలయం అంటే.. ఇప్పుడూ అదే పని చేశారు. నేతలెవర్నీ ఇంట్లో నుంచి బయటకు రానీయలేదు పోలీసులు. ఉత్తమ్ నుంచి వీహెచ్ వరకూ అందర్నీ హౌస్ అరెస్ట్ చేశారు.

సీఎంను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకే సచివాలయానికి వెళ్తున్నామని దానికి.. కూడా పోలీసులు అంగీకరించకపోవడం… ఏమిటని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అపాయింట్‌మెంట్ ఇచ్చారని.. అయినా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క వాపోయారు. కేసీఆర్‌ 10వేలమందితో కొండపోచమ్మ ప్రాజెక్టును ప్రారంభోత్సవం.. కేటీఆర్‌ వేలాదిమందితో సిరిసిల్లలో జలహారతి కార్యక్రమం చేశారని…కాంగ్రెస్ నేతలను మాత్రం అరెస్ట్ చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఎక్కువ చేస్తున్నారు, మేం పాకిస్తాన్‌ బోర్డర్‌లో ఉన్నామా అని వీహెచ్ ప్రశ్నించారు.

రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుదామని ప్రజా పోరాటాలు ప్రారంభించాలనుకున్న టీ కాంగ్రెస్‌కు పోలీసులు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. సాధారణంగా పోలీసులు శాంతిభద్రతల సమస్య వస్తుందనుకున్నప్పుడే…హౌస్ అరెస్టులు చేస్తారు. కానీ కాంగ్రెస్ నేతలు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నారు. పోలీసులు వెంటనే వచ్చేస్తున్నారు. గోదావరి ప్రాజెక్టులపై తర్వాత దీక్షలు పెట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు.. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు వారిని అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close