నాగ్ – ప్ర‌వీణ్ స‌త్తారు.. ప‌క్కా!

`వైల్డ్ డాగ్‌` త‌ప్ప నాగార్జున చేతిలో సినిమాలేం లేవు. ధ‌నుష్ తో చేయాల‌నుకున్న మల్టీస్టార‌ర్ కూడా మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించే క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈలోగా నాగ్ మ‌రో ప్రాజెక్టు ఓకే చేశాడు. ప్ర‌వీణ్ స‌త్తారు చెప్పిన క‌థ‌కు నాగ్ ఫ్లాట్ అయ్యాడు. వీరిద్ద‌రి కాంబో ఖాయ‌మైంది. ఈ చిత్రాన్ని ఏసియ‌న్ సునీల్ తెర‌కెక్కిస్తారు. నాగ‌చైత‌న్య‌తో ల‌వ్ స్టోరీని తెర‌కెక్కిస్తోంది ఈ సంస్థే. ఇప్పుడు నాగార్జున‌తో కూడా సినిమా ఓకే చేసింది. గ‌రుడ వేగ లాంటి హిట్ త‌ర‌వాత‌.. ప్ర‌వీణ్ స‌త్తారు చేస్తున్న సినిమా ఇది. ఈసారి కూడా అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్ లాంటి స‌బ్జెక్ట్ తో ప్ర‌వీణ్ స‌త్తారు వ‌స్తున్నాడ‌ని స‌మాచారం. ఈ క‌థ‌లో బోలెడంత యాక్ష‌న్ స్కోప్ ఉంద‌ని తెలుస్తోంది. ఈమ‌ధ్య ఎందుక‌నో నాగార్జున యాక్ష‌న్ క‌థ‌ల‌వైపు దృష్టి సారిస్తున్నాడు. `వైల్డ్ డాగ్‌` కూడా యాక్ష‌న్ మూవీనే. ప్ర‌వీణ్ స‌త్తారు కొత్త సినిమా గురించి అధికారికంగా త్వ‌ర‌లోనే ఓ ప్ర‌క‌ట‌న రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close