‘గరం’ రివ్యూ

చల్లారిన ‘గరం’ చాయ్
‘గరం’ రివ్యూ
బ్యానర్ :శ్రీనివాసాయి స్క్రీన్స్‌
నటీనటులు: ఆది, అదాశర్మ, నరేష్‌, తనికెళ్ళ భరణి,
కబీర్‌ సింగ్‌, షకలక శంకర్‌ తదితరులు
కెమెరా: టి.సురేంద్రరెడ్డి
సంగీతం: అగస్త్య
ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌
కథ, మాటలు: శ్రీనివాస్‌ గవిరెడ్డి
నిర్మాత: సురేఖ పి.
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌.ఆర్‌.మదన్‌
విడుదల తేదీ: 12.02.2016

ప్రేమకావాలి, లవ్‌లీ వంటి హిట్‌ సినిమాలతో లవర్‌బోయ్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న ఆది ఆమధ్య ‘రఫ్‌’ చిత్రంలో మాస్‌ క్యారెక్టర్‌ చేసినా అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు లేటెస్ట్‌గా మదన్‌ కాంబినేషన్‌లో చేసిన ‘గరం’తో మరోసారి మాస్‌ ఇమేజ్‌ తెచ్చుకునే ప్రయత్నం చేశాడు ఆది. ఇప్పటివరకు ఇటువంటి మాస్‌ మసాలా మూవీ చెయ్యని మదన్‌ ఫస్ట్‌టైమ్‌ చేసిన ఈ ‘గరం’ చిత్రాన్ని ఆడియన్స్‌ ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు? ఆది ఈ చిత్రంతో మరో హిట్‌ కొట్టగలిగాడా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
మన హీరో పేరు వరాలు(ఆది) చదువు కంటే గాలి తిరుగుళ్ళనే ఎక్కువ ఇష్టపడే వరాలు రోజూ తండ్రితో క్లాస్‌ పీకించుకుంటూ వుంటాడు. దానికితోడు పక్కింటిలో వుండే రవి బాగా చదువుతాడని, అతన్ని చూసి బుద్ధి తెచ్చుకొమ్మని చెప్తుంటాడు. రవి(చైతన్యకృష్ణ) తండ్రి(నరేష్‌) కూడా తన కొడుకుని చూసి నేర్చుకొమ్మని వరాలుకి పదే పదే చెప్తుంటాడు. తనకంటే తెలివి గలవాడని, తనకంటే బాగా చదువుతాడని అందరూ అనడంతో రవి అంటే వరాలుకి ద్వేషం పెరుగుతుంది. రవికి కూడా వరాలు అంటే ఇష్టం వుండదు. రవి సిటీలో ఉద్యోగం సంపాదించుకుంటాడు. ఈ విషయంలో తండ్రితో గొడవపడి తను కూడా గొప్పవాడిగా పేరు తెచ్చుకుంటానని సిటీకి బయల్దేరతాడు వరాలు. సిటీకి వచ్చీ రావడంతోనే ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. తనను ప్రేమించమంటూ ఆమె వెంట తిరుగుతుంటాడు. మరో పక్క ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తుంటాడు. అయితే తను సిటీకి వచ్చింది ఉద్యోగం కోసం, అమ్మాయిని ప్రేమించడం కోసం కాదని చెప్పడంతో అతని ఫ్రెండ్స్‌ ఆశ్చర్యపోతారు. తను వచ్చింది రవి కోసమని చెప్పడం వాళ్ళు షాక్‌ అవుతారు. రవి అంటే ఇష్టం లేని వరాలు అతని కోసం సిటీకి ఎందుకొచ్చాడు? ఉద్యోగం కోసం వెళ్ళిన రవికి ఏం జరిగింది? సిటీకి రాగానే వరాలు ఓ అమ్మాయి వెనక పడడం వెనుక ఏదైనా రీజన్‌ వుందా? రవికి, ఆ అమ్మాయికి వున్న రిలేషన్‌ ఏమిటి? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌:
మాస్‌ క్యారెక్టర్స్‌ చేసినా లవర్‌బోయ్‌గానే అందర్నీ ఆకట్టుకున్న ఆది ఈ సినిమాలో మరోసారి మాస్‌ క్యారెక్టర్‌ ట్రై చేశాడు. అయితే మాస్‌ లుక్‌తోగానీ, మేనరిజమ్స్‌తోగానీ ఆకట్టుకోలేకపోయాడు. అతను రెగ్యులర్‌గా చేసే లవ్‌ సీన్స్‌, కామెడీ సీన్స్‌, డాన్స్‌, ఫైట్స్‌ వంటి వాటిలో ఓకే అనిపించుకున్నా మాస్‌ ఆడియన్స్‌ని మెప్పించే పెర్‌ఫార్మెన్స్‌ ఇవ్వలేకపోయాడు. అదాశర్మ గ్లామర్‌ ఈసినిమాకి కొంతవరకు ప్లస్‌ అయిందని చెప్పాలి. పాటల్లో అక్కడక్కడా ఎక్స్‌పోజింగ్‌ కూడా చేసిన అదా పెర్‌ఫార్మెన్స్‌ పరంగా కూడా ఫర్వాలేదు అనిపించుకుంది. ఆది ఫ్రెండ్స్‌గా నటించిన షకలక శంకర్‌, మధునందన్‌ అక్కడక్కడా నవ్వించారు. చైతన్యకృష్ణ తండ్రిగా నరేష్‌ నటన కొన్ని చోట్ల అందర్నీ కదిలిస్తుంది. సెంటిమెంటల్‌ డైలాగ్స్‌తో నరేష్‌ పెర్‌ఫార్మెన్స్‌ హార్ట్‌ టచ్చింగ్‌గా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:
కథ, కథనాలు ఎలా వున్నా టెక్నికల్‌గా సినిమాకి కొంత సపోర్ట్‌ వుంటే విజువల్‌గా ఆడియన్స్‌ని బాగా అలరించే అవకాశం వుంటుంది. అయితే ఈ సినిమాకి ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమాలో టెక్నికల్‌గా చెప్పుకోవడానికి ఏమీ లేవు. సినిమాటోగ్రఫీ ఎక్కడా మనకు కనువిందుగా అనిపించదు. చాలా చోట్ల లైటింగ్స్‌ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోలేదు అనిపిస్తుంది. ఫారిన్‌లో తీసిన పాటలు మాత్రం విజువల్‌గా కొంత గ్రాండ్‌గా అనిపించాయి. అగస్త్య పాటలు కూడా చాలా రొటీన్‌గా వున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అంతంత మాత్రమే. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ వంటి ఔట్‌ డేటెడ్‌ సబ్జెక్ట్‌తో సినిమా రూపొందించిన శ్రీనివాస్‌ గవిరెడ్డి ఈ సినిమాకి కథ, మాటలు ఇచ్చాడని తెలిసిన తర్వాత ఈ సినిమా ఎలా వుండబోతోంది అనే విషయంలో ఆడియన్స్‌కి కొంత క్లారిటీ వచ్చింది. అందరూ ఊహించినట్టుగానే ఈ సినిమా కథ కూడా ఔట్‌ డేటెడ్‌ అనే చెప్పాలి. అతని కథలోగానీ, మాటల్లోగానీ ఎక్కడా ఫ్రెష్‌ నెస్‌ కనిపించలేదు. దానికి తగ్గట్టుగానే మదన్‌ చేసిన స్క్రీన్‌ప్లే కూడా చాలా నాసిరకంగా అనిపిస్తుంది. ఒక పాట, ఒక ఫైట్‌, ఒక కామెడీ సీన్‌… సినిమా అంతా ఇలాగే వుంటుంది.

విశ్లేషణ:
మనం చాలా సినిమాల్లో చూసినట్టుగానే హీరో ఒక ఫైట్‌తో ఎంట్రీ అవుతాడు. ఒక ఐటమ్‌ గర్ల్‌తో పాట పాడుకుంటాడు. ఫ్రెండ్స్‌ని వెంటేసుకుని బలాదూర్‌ తిరుగుతుంటాడు. గొప్పవాడిగా పేరు తెచ్చుకుంటానని సిటీ బయల్దేరతాడు. అక్కడ ఓ అమ్మాయిని చూసి లవ్‌లో పడతాడు. ఇలా ఫస్ట్‌ హాఫ్‌ అంతా కథలోకి వెళ్ళకుండా ఒక దాని తర్వాత ఒక సీన్‌ వస్తుంటుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో మాత్రమే నెక్స్‌ట్‌ ఏదో జరగబోతోంది అనిపిస్తుంది. సెకండాఫ్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుందని ఎక్స్‌పెక్ట్‌ చేసిన ఆడియన్స్‌ ఫస్ట్‌ హాఫ్‌లో బోర్‌ కొట్టించిన సీన్స్‌నే మళ్ళీ చూస్తున్నట్టు ఫీల్‌ అవుతారు. తన పక్కింటి కుర్రాడికి ఏదో జరిగింది దాన్ని కనుక్కొని అతన్ని రక్షించాలి అనే చిన్న పాయింట్‌తో రెండున్నర గంటల సినిమా తీసెయ్యాలని ఆశ పడ్డ మదన్‌కి ఈ సినిమా నిరాశే మిగులుస్తుందని వేరే చెప్పక్కర్లేదు. సెకండాఫ్‌లో కూడా కథలో స్పీడ్‌ పెరగకపోవడం, చెప్పాల్సింది అంతా క్లైమాక్స్‌లో చెప్పేద్దాం అనుకొని అక్కడి వరకు సినిమాని సాగదీయడంతో ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అవుతారు. తెలుగు ప్రేక్షకుల టేస్ట్‌ మారిందని ఇప్పటికే చాలా సినిమాల రిజల్ట్స్‌ ప్రూవ్‌ చేశాయి. అయినా ఇలాంటి పాత చింతకాయ పచ్చడినే మళ్ళీ మళ్ళీ రుచి చూపించాలని ట్రై చేస్తున్న డైరెక్టర్స్‌ మాత్రం మారడం లేదు. ఫార్ములా సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమాని చూసి ఎంటర్‌టైన్‌ అవుతారు. ఏదైనా కొత్తగా వుండాలని ఎక్స్‌పెక్ట్‌ చేసేవారు మాత్రం డిజప్పాయింట్‌ అవుతారు.

తెలుగు360.కామ్ రేటింగ్‌: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close