రివ్యూ : ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ – మంచి ఎమోషన్స్ వున్న ప్రేమగాథ

అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట గత ఏడేళ్ళ క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన మంచి నిర్మాతలు వీరి ముగ్గురి కాంబినేషన్ లో నమో వేంకటేశ, దూకుడు,1 – నేనొక్కడినే, ఆగడు వంటి భారీ చిత్రాలు నిర్మించి, ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ చిత్రం భాగస్వామ్యంలో నిర్మించడంతో పాటు ఈ ముగ్గురూ కలిసి అగ్ర నిర్మాతల జాబితాలోకి చేరిపోయారు. ఇప్పుడు నానితో నిర్మించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’పై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మంచి కథలు సెలక్ట్ చేసుకుని, నాని సినిమాలు చేస్తాడు. ‘అందాల రాక్షసి’తో ప్రతిభ ఉన్న దర్శకుడనిపించుకున్న హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మొత్తం మీద ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి.. ఈ ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఎలా ఉందో తెలుసుకుందాం…

కథ :

కృష్ణ (నాని) నందమూరి నటసింహం బాలకృష్ణ వీరాభిమాని. చిన్నప్పట్నుంచి మహాలక్ష్మీ (మెహ్రీన్) ని విపరీతంగా ప్రేమిస్తుంటాడు. రాజన్న (రామరాజు) అన్నయ్య కూతురు మహాలక్ష్మీ. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కుటుంబ నేపధ్యం రాజన్నది. అదే ఊరికి చెందిన అప్పిరెడ్డి, రాజన్న మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పగ ఉంటుంది. మహాలక్ష్మీ అన్నయ్య రామరాజు అంటే ఊరిలోని వారందరికీ భయం. కృష్ణకు కూడా భయం. తన పిరికితనం వల్ల 15యేళ్లుగా మహాలక్ష్మీని ప్రేమిస్తున్నా, ఎవ్వరికీ ఈ విషయాన్ని తెలియనివ్వడు. మహాలక్ష్మీ కూడా తన ప్రేమ విషయాన్ని బయటికి చెప్పదు. పైకి ఇద్దరూ ఒకరంటే ఒకరికి పడదనే విధంగా నటిస్తూ, రహస్యంగా ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. తన ప్రేమ విషయం మహాలక్ష్మీ అన్నయ్యకు ఎలా చెప్పాలో తెలీక భయంతో వణికిపోతుంటాడు కృష్ణ. ఈలోపు మహాలక్ష్మీకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. కట్ చేస్తే… రాజన్న ఇంట్లోకి ఓ గ్యాంగ్ చొరబడి ఎటాక్ చేస్తారు. ఈ ఎటాక్ జరిగిన సమయంలో రాజన్న తమ్ముడు ఏసిపి శ్రీకాంత్ (సంపత్ రాజ్) పిల్లలు ఇంట్లో ఉంటారు. వారిని ఈ ఎటాక్ నుంచి తప్పించి మహాలక్ష్మీ అన్నయ్య రామరాజు ఊరు దాటించడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఆ సమయంలో తనకు ఎదురుపడిన కృష్ణకు పిల్లలను అప్పగించి హైదరాబాద్ లోని శ్రీకాంత్ కి ఇంటికి చేర్చమని చెబుతాడు రామరాజు. అలా చేస్తే, తన చెల్లెలు మహాలక్ష్మీని ఇచ్చి పెళ్లి చేస్తానని చెబుతాడు. దాంతో పిల్లలను తీసుకుని కారులో హైదరాబాద్ బయలుదేరతాడు కృష్ణ. అయితే పరిస్థితులను బట్టి కృష్ణ తమను కిడ్నాప్ చేస్తున్నాడని పిల్లలు అపార్ధం చేసుకుంటారు. కట్ చేస్తే…తన ఇంటిపై ఎటాక్ చేసింది ఊరిలోని పగ వాళ్లు కాదు… ఇంటర్నేషనల్ మాఫియా లీడర్ డేవిడ్ గ్యాంగ్ అని తెలుసుకుంటాడు ఎసిపి శ్రీకాంత్. డేవిడ్ గ్యాంగ్ ఎసిపి శ్రీకాంత్ పిల్లలను కిడ్నాప్ చేసి, శ్రీకాంత్ అధ్వర్యంలో ఉన్న డేవిడ్ బాయ్ (మురళీ శర్మ)ను విడిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా కృష్ణ దగ్గర ఉన్న పిల్లలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మరి అసలే పిరికివాడైన కృష్ణ మాఫియా గ్యాంగ్ నుంచి పిల్లలను కాపాడాడా… తమను కిడ్నాప్ చేస్తున్నది కృష్ణ కాదని పిల్లలు తెలుసుకుంటారా.. తన మహాలక్ష్మీని దక్కించుకున్నాడా… అనేదే ఈ చిత్ర కథ.

నటీనటులు పెర్ ఫామెన్స్:

పదహెను ఏళ్ళుగా ఓ అమ్మాయిని ప్రేమించే అబ్బాయి కృష్ణగా నాని అద్భుతంగా నటించాడు. ధైర్యంలేని పిరికివాడుగా కూడా నాని చక్కటి నటన కనబర్చాడు.చిన్న పిల్లలతో సెంటిమెంట్ సీన్స్ కూడా నాని తనదైన శైలిలో నటించి శభాష్ అనిపించుకున్నాడు. రాయలసీమ స్లాంగ్ మాట్లాడాడు. ‘భలే భలే మగాడివోయ్’ లాంటి హిట్ చిత్రం తర్వాత నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ చిత్రాన్ని అంగీకరించి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. హీరోయిన్ మెహ్రీన్ అందంగా ఉంది. నటన పరంగా కూడా ఓకే. కాజల్ కి దగ్గర పోలికలు ఉండటం వల్ల మెహ్రీన్ ని జూనియర్ కాజల్ అని పిలుస్తారు. ఎసిపి శ్రీకాంత్ గా సంపత్ రాజ్ స్టైలిష్ గా ఉన్నాడు. ఇక ప్రధాన పాత్రలు పోషించిన మురళీ శర్మ, బ్రహ్మాజీ, పృధ్వీ, రామరాజు, అన్నపూర్ణ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసాడు. ఈ చిత్రంలో నటించిన ముగ్గురు చిన్నారులు నయన, మాస్టర్ ప్రదమ్, బేబి మోక్షలు చక్కగా నటించారు.

సాంకేతిక వర్గం:

హను రాఘవపూడి సింఫుల్ లవ్ స్టోరీని చాలా కొత్తగా ప్రజెంట్ చేయడంతో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. స్ర్కీన్ ప్లే బాగుంది. డైలాగులు కూడా బాగున్నాయి. డైరెక్టర్ గా హను ఈ చిత్రంలో మరో మెట్టు ఎక్కనట్టే. టేకింగ్ చాలా బాగుంది. ఎంటర్ టైన్ మెంట్ ని కూడా మిస్ అవ్వలేదు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్, మాఫియా గ్యాంగ్, చిన్న పిల్లల కిడ్నాప్ తో ముడిపడి ఉన్న కృష్ణ, మహాలక్ష్మీల ప్రేమగాధను చక్కటి డైలాగులతో తెరకెక్కించిన వైనం బాగుంది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ఓ హైలెట్. రాయలసీమ ప్రాంతాన్ని చక్కగా చూపించారు కెమెరామ్యాన్ యువరాజ్. విశాల్ చంద్రశేఖర్ పాటలు, రీ-రికార్డింగ్ బాగున్నాయి. ఇక 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ అధినేతలు రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర సినిమాపై తమకున్న ఫ్యాషన్ ని నిరూపించుకున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు.

విశ్లేషణ:

హీరో బాలయ్య అభిమాని అని చెప్పే సీన్లు ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి. బాలయ్య అభిమానులు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. ఓ పిరికివాడు తన ప్రేమను గెలిపించుకోవడానికి పడిన తపనను పర్ ఫెక్ట్ గా ఆవిష్కరించాడు డైరెక్టర్ హను. తను ప్రేమించిన అమ్మాయి అన్నయ్య మనుషులను అతి కిరాతకంగా చంపుతుంటే. అదే సీన్ లో ఓ పక్షికి దెబ్బ తగలకుండా హీరో కాపాడటం హీరో క్యారెక్టరైజేషన్ పక్కగా ఎలివేట్ అవుతుంది. ఇలాంటి సున్నితమైన  సీన్లు హార్ట్ టచింగ్ గా అనిపించాయి. సీన్స్ న్యాచురల్ గా ఉన్నాయి. తన ప్రేమికురాలిని చంపేసానని విలన్ చెప్పినప్పుడు పిరికివాడైన హీరో రియాక్ట్ అయిన విధానం చాలా బాగుంది. ఎమోషనల్ టచ్ తో కూడుకున్న ఈ సీన్లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ‘భలే భలే మగాడివోయ్’ లాంటి హిట్ చిత్రం తర్వాత నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ చిత్రాన్ని అంగీకరించి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్టాప్ అంతా కృష్ణ, మహాలక్ష్మిల ప్రేమ కథతో, సెకండాఫ్ పిల్లలను కాపాడటానికి హీరో చేసే ప్రయత్నం, మాఫియా గ్యాంగ్ తో యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగిపోతుంది. హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ కూడా బాగుంది. చివరాఖరుగా చెప్పాలంటే… కృష్ణగాడి వీర ప్రేమ గాధ సూపర్ హిట్… ఆడియన్స్ కి కృష్ణ, మహాలక్ష్మీల ప్రేమ బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.

తెలుగు360.కామ్ రేటింగ్‌: 3.5/5

బ్యానర్ : 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు : నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, ఫృధ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్ శ్రీ ప్రతమ్, బేబి మోక్ష, రామరాజు తదితరులు
సినిమాటోగ్రఫీ : యువరాజ్
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
డైలాగ్స్ : హను రాఘవపూడి, జయకృష్ణ
నిర్మాతలు : రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : హను రాఘవపూడి
విడుదల తేది : 12.02.2016

Click here for Krishna Gadi Veera Prema Gadha English Review

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోస్ట‌ర్‌తోనే పోలిక‌లు మొద‌లా?

రాజ‌మౌళి సినిమాలు ఎంత గొప్ప విజ‌యాన్ని సాధిస్తాయో, రాజ‌మౌళికి, అత‌ని టీమ్ కీ ఎంత పేరు తీసుకొస్తాయో.. మిగిలిన వాళ్ల‌కు అంత ప‌రీక్ష‌గా మిగిలిపోతాయి. భారీ సినిమా ఏదొచ్చినా రాజ‌మౌళి సినిమాల‌తో పోలిక‌లు...

జగన్ కుటుంబంలో చిచ్చుకు సజ్జలే కారణమంటున్న టీఆర్ఎస్ !

ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న హరీష్ రావుకు.. కేసీఆర్‌తో గొడవలు ఉన్నాయని సజ్జల చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. అసలు జగన్ కుటుంబం ఇలా చీలికలు పేలికలు అయిపోవడానికి...

వినతి పత్రాన్ని వీఆర్‌ఏల మీదే విసిరికొట్టిన కేసీఆర్ !

సీఎం కేసీఆర్‌కు కోపం వచ్చింది. అది చిన్న కోపం కాదు. సీఎంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని స్థిరచిత్తంతో ఉండాల్సిన కేసీఆర్ ఒక్క సారిగా తన చేతిలో ఉన్న వినతి పత్రాన్ని విసిరికొట్టారు. అదీ...

సీబీఐ కేసులో స్టే తెచ్చుకున్న రఘురామ !

ఇండ్ భారత్ కంపెనీల ద్వారా బ్యాంకులకు పెద్ద మొత్తంలో అప్పులు చేసి ఎగ్గొట్టిన వ్యవహారంలో తన కంపెనీలపై జరుగుతున్న విచారణపై రఘురామ ఊరట పొందారు. సుప్రీంకోర్టు సీబీఐ కేసు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close