రాజ్యసభ ఎన్నికల్లో ఆ ముగ్గురు టీడీపీ అభ్యర్థికే ఓటేస్తారా..?

తెలుగుదేశం పార్టీని ధిక్కరించి వైసీపీలో అధికారికంగా చేరకపోయినా అనుబంధ సభ్యులుగా మారిపోయిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మొదటి సారి విషమ పరీక్షరాజ్యసభ ఎన్నికల రూపంలో ఎదురు కాబోతోంది. శుక్రవారం..రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు స్థానాలకు ఐదుగురు సభ్యులు పోటీ పడుతున్నారు. బలం లేకపోయినా టీడీపీ వర్ల రామయ్యను అభ్యర్థిగా నిలిపింది. దీంతో తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. ఇప్పుడు తప్పని సరిగా ఆ ఎమ్మెల్యేలు…టీడీపీ విప్ కు అనుగుణంగా.. వర్ల రామయ్యకు ఓటు వేయాల్సి ఉంటుంది.

ఒక్కో రాజ్యసభ అభ్యర్థికి 34 ఓట్లు వస్తే విజయం సాధిస్తారు. తెలుగుదేశం బలం 23… అందులో ముగ్గురు వైసీపీ గూటికి చేరారు. పార్టీని ధిక్కరించిన ఆ ముగ్గురిపై అనర్హతా వేటు వేయడానికి ఇంతకు మించిన మార్గం దొరకదని టీడీపీ భావించినట్లుగా కనిపిస్తోంది. అందుకే విప్ జారీ చేశారు. ఓటింగ్ కు గైర్హాజర్ అయినా విప్ ధిక్కరించినట్లే. వ్యతిరేకంగా ఓటు వేసినా విప్ ధిక్కరించినట్లే. నిజానికి టీడీపీ అభ్యర్థికి ఆ ముగ్గురు ఓటు వేయడం వల్ల.. వారికి పోయేది ఏమీలేదు..వైసీపీకి జరిగే నష్టం ఏమీ లేదు. కానీ పార్టీని ధిక్కరించి వెళ్లిపోయిన తరవాత ఆ పార్టీ అభ్యర్థికి ఎలా మద్దతిస్తారనేది ఇప్పుడు..కీలకంగా మారింది.

ఇప్పటికిప్పుడు వారు అనర్హతా వేటు పడకుండా తప్పించుకోవాలన్నా..వివాదాస్పదం కాకుండా.. ఉండాలన్నా… టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడమే మంచిదని భావిస్తున్నారు. వైసీపీ తరపున నలుగురు సభ్యుల ఎంపిక లాంఛనమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో 151 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండటం వారిలో చాలా మంది రాజ్యసభ ఎన్నికలకుకొత్త కావడంతో.. మాక్ పోలింగ్‌లోనే పలువురు తడబడుతున్నారు. ఈ టెన్షన్ కూడా వైసీపీకి కల్పించినట్లు అవుతుందని టీడీపీ నేతలు అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close