కాళేశ్వరం సబ్ కాంట్రాక్టర్లు ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలా..?

కొండపోచమ్మ సాగర్ కాలువకు పడిన గండిని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాజకీయంగా ఉపయోగపడుతోంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు అతి సమీపంలో ఉండే వెంకటాపూర్ గ్రామాన్ని ఆ నీరు ముంచెత్తింది. అయితే.. సమస్య అది కాదు.. ఇప్పుడు … కాంగ్రెస్ రాజకీయం మొత్తం.. ఆ కాలువను నిర్మించిన కాంట్రాక్టర్ చుట్టూనే తిరుగుతోంది. అందులోని విషయాలన్నీ బయటకు తీస్తే.. పార్టీ ఫిరాయింపుల కోణం కూడా బయటకు వస్తోంది. దీంతో.. కాంగ్రెస్ నేతలకు కొత్త ఉత్సాహం పుట్టుకు వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ టెండర్ ..మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి దక్కింది. కానీ ఆ కంపెనీ చాలా పనులను.. సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చింది.

ఇలా కొండ పోచమ్మ సాగర్ పనులను..కూడా.. వేరే కంపెనీకి ఇచ్చింది. ఆ కంపెనీ నాసిరకం పనులు చేయడంతో ప్రారంభించిన ఒకటి, రెండు రోజుల్లోనే గండి పడింది. ఇప్పుడు ఆ సబ్ కాంట్రాక్టర్ ఎవరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వెలికి తీసింది. తీరా చూస్తే.. ఆయన ఫిరాయించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అనే విషయం బయటపడింది. దీంతో కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇలా కాంట్రాక్టులు ఆశ చూపి.. పార్టీలో చేర్చుకున్నారని.. వారు నాసికరం పనులు చేసి.. ప్రజా ధనం కొల్లగొట్టారని ఆరోపిస్తున్నారు. ఇది పెద్ద స్కాం అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు.. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు.

గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో మెజార్టీ టీఆర్ఎస్ లో చేరిపోయారు. వారిలో సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్లకి పదవులు.. ఇతరులకు కాంట్రాక్టులు.. వచ్చాయని చెబుతున్నారు. ఇప్పుడు ఎవరెవరికి ఎలాంటి లబ్ది కలిగిందో.. బయటకు తీసి ప్రజల ముందు పెట్టాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. ప్రజాధనం దోచి.. ఫిరాయింపులకు ఉపయోగించారనే విషయాన్ని హైలట్ చేయాలనే నిర్ణయించుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close