అమరావతికి ఎయిర్‌పోర్టు ఉందా..? రైల్వే స్టేషన్ ఉందా..?

అమరావతి పోరాటం విషయంలో ప్రభుత్వం ఎదురుదాడి చేయడానికి విచత్రమైన కారణాలను ఎదుర్కొంటోంది. ఉద్యమం ప్రారంభమై 200 రోజులు అయిన సందర్భంగా పెద్ద ఎత్తున దేశ, విదేశాల నుంచి రైతులకు సంఘిభావం తెలియచేశారు. ఈ సందర్భంగా.. వైసీపీ మంత్రులు.. కొన్ని భిన్న వాదనలతో తెరపైకి తెచ్చారు. మంత్రి కన్నబాబు.. అదేదో ఇరవై తొమ్మిది గ్రామాల సమస్య అన్నట్లుగా నిన్న వాదించారు. ఆదివారం మంత్రి అవంతి శ్రీనివాస్ మరింత భిన్నమైన ఎదురుదాడి చేశారు. అమరావతి అభివృద్ధి చేయాలంటే 30 ఏళ్లు పడుతుందని .. అమరావతి బస్టాండ్ ఉందా..రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్‌పోర్టు ఉందా? అని ప్రశ్నించారు.

రాజధానికి రైతులకు దేశ విదేశాల నుంచి వచ్చిన మద్దతు అంతా.. చంద్రబాబు జూమ్ రాజకీయాలతో ఆర్గనైజ్ చేశారని విమర్శించారు. అమరావతి కావాలో విశాఖ కావాలో దమ్ముంటే.. నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. విశాఖ నుంచి కూడా అమరావతికి పెద్ద ఎత్తువ మద్దతు లభించింది. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. సబ్బం హరి కూడా.. అమరావతి రైతులకు మద్దతుగా ప్రసంగించారు. దీంతో.. ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న సవాల్‌తో అవంతి తెరపైకి వచ్చారు.

రాజధని మార్చాలనుకుంటోంది కాబట్టి… ఆ ప్రజాభిప్రాయం ఏదో.. కనుక్కోవాల్సింది వైసీపీనే. కానీ.. అవంతి శ్రీనివాస్ మాత్రం.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయం వైసీపీ చేస్తోందని విమర్శలు వస్తున్నా.. మంత్రులు.. ఎవరికి వారు ఎక్కడి పాట అక్కడ పాడుతున్నారు.ఈ విషయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ముందున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close