ఉరిమి ఉరిమి ప్రైవేట్ ల్యాబ్స్‌పై పడుతున్న తెలంగాణ సర్కార్..!

కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ తప్పు అంతా ప్రైవేటు ల్యాబ్స్‌ మీద నెట్టేస్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో టెస్టులు చేస్తున్న పదహారు ప్రైవేటు ల్యాబుల్లో పదమూడింటికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం… టెస్టుల కోసం.. సరైన సౌకర్యాలు కల్పించుకోలేదని.. అదే సమయంలో…పాజిటివ్ రేటు అసాధారణంగా ఉంటోందని..దీనికి కారణం ఏమిటో తేలాలని తెలంగాణ సర్కార్ అంటోంది. గత మూడు, నాలుగు రోజుల నుంచి.. తెలంగాణలో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. వీటిలో అత్యధికం ప్రైవేటు ల్యాబుల్లో జరిపిన టెస్టులే. ప్రైవే టు ల్యాబులన్నీ కలిపి 9,577 టెస్టులు చేసినట్టు ఐసీఎంఆర్ పోర్టల్‌‌ లో అప్ లోడ్ చేశాయి. వీటిలో 2,076 పాజిటివ్స్ ఉన్నట్లుగా నిర్ధారించాయి.

అదే సమయంలో…తెలంగాణ స్టేట్ హెల్త్ పోర్టల్‌లో మాత్రం 6,733 టెస్టులు చేసినట్టు చూపించి.. 2,836 పాజిటివ్ వచ్చినట్లుగా రికార్డు చేశారు. ఇది ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. చేస్తున్న పరీక్షలను పూర్తి స్థాయిలో అప్ లోడ్ చేయకపోవడం… అప్ లోడ్ చేసిన టెస్టుల్లో అత్యధికం పాజిటివ్ ఉండటం వల్ల తెలంగాణలో టెస్ట్ పాజిటివ్ రేట్ ఎక్కువగా వస్తోంది. దీని వల్ల హైదరాబాద్ కరోనా వైరస్ తీవ్రంగా ఉందన్న అభిప్రాయం ప్రబలిపోతోందని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మండిపడుతున్నారు. అయితే.. ఆ టెస్టులన్నీ తప్పు అని చెప్పడం లేదు. కేవలం.. నెగెటివ్ వచ్చిన వాటిని లెక్కలో చూపడం లేదనే అధికారుల ఆగ్రహంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం పదమూడు ల్యాబ్స్‌కు నోటీసులు జారీచేసింది. చాలా ల్యాబుల్లో కనీసం పీపీఏ కిట్లు కూడా వాడటం లేదని.. ప్రభుత్వం అంటోంది. అయితే ఈ వివాదపై ప్రైవేటు ల్యాబ్‌లు.. భిన్నంగా స్పందిస్తున్నాయి. పాజిటివ్ వచ్చిన వారికి త్వరగా రిపోర్టులు ఇవ్వాలని కాబట్టి వేగంగా ఎంట్రీ చేస్తున్నామని.. నెగెటివ్ వచ్చిన వారి వివరాలు మెల్లగా అప్ లోడ్ చేస్తున్నామని అంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వ ఆగ్రహం మాత్రం..ప్రైవేటు ల్యాబ్స్‌పై పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌పైకి గోనె ప్రకాష్‌రావును పంపిందెవరు..?

తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్నాడో లేడో తెలియని నేత గోనె ప్రకాష్ రావు. వైఎస్ ఉన్నప్పుడు.. ఆయన అనుచరునిగా.. హైకమాండ్ దగ్గర పలుకుబడి ఉన్న మధుయాష్కీని టార్గెట్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు....

రివ్యూ: జ‌గ‌మే తంత్రం

హీరోకి ఓ ఇమేజ్‌, ద‌ర్శ‌కుడికి ఓ బ్రాండ్.. ఉండాల‌ని కోరుకుంటారు. అవి ప‌డిపోతే... వాళ్లు ఆయా రంగాల్లో నిల‌బ‌డిపోయిన‌ట్టే. కాక‌పోతే... ఇమేజ్‌, బ్రాండ్ అనేవి వాళ్ల కెరీర్‌కి అనుకోని అడ్డుగోడ‌లుగా మిగిలిపోతాయి. వాళ్ల‌నుంచి...

జగన్ “క్యాలెండర్‌”పై నెగెటివ్ టాక్..!

ముఖ్యమంత్రి విడుదల చేసిన జాబ్స్ క్యాలెండర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి పాత ట్వీట్లను బయటకు తీయడమే కాదు.. ఇటీవలి కాలంలో చేసిన ప్రకటనలను కూడా బయటకు...

అశోక్‌గజపతిరాజును జైలుకు పంపుతాం : విజయసాయిరెడ్డి

మాన్సాస్ ట్రస్ట్ మళ్లీ తమ చేతుల్లో నుంచి జారిపోయిందని అసహనమో... చేయాలనుకున్న భూ మాయ అంతా చేయలేకపోతున్నామన్న ఆగ్రహమో కానీ.. ఉత్తరాంధ్ర సీఎంగా చెలామణి అవుతున్న విజయసాయిరెడ్డి కంట్రోల్ తప్పి...

HOT NEWS

[X] Close
[X] Close