ఐనవోలు నుంచి విజయవాడకు అంబేద్కర్ స్మృతివనం..!

అమరావతి మాస్టర్ ప్లాన్‌లో గత ప్రభుత్వం దాదాపు వంద ఎకరాల్లో నిర్మించాలనుకున్న అంబేద్కర్ స్మృతి వనం పనులను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు.. విజయవాడ స్వరాజ్ మైదానంలో కట్టాలని నిర్ణయించుకుంది. స్వరాజ్ మైదానం దాదాపుగా 20 ఏకరాలు ఉంటుంది. ఇందులోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు మెమోరియల్ పార్క్‌ను నిర్మిస్తారు. ప్రస్తుతం.. ఈ భూమి న్యాయవివాదాల్లో ఉంది. అదే సమయంలో ఇరిగేషన్ శాఖకు ఆధ్వర్యంలో ఉంది. న్యాయవివాదాల సంగతేమో కానీ.. ఇరిగేషన్ శాఖ నుంచి భూమిని.. సాంఘిక సంక్షేమ శాఖకు మార్పించారు. బుధవారం శంకుస్థాపన చేసి ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు

గత ప్రభుత్వం అమరావతి రాజధాని గ్రామాల్లో ఒకటి అయిన ఐనవోలులో.. వంద ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనానికి శంకుస్థాపన చేసింది. వంద కోట్లు కేటాయించింది. మిగిలిన అమరావతి పనుల్లాగే.. అది కూడా.. ఇరవై శాతం లోపు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అమరావతి పనుల్లాగే.. ఆ స్మృతి వనం పనులను నిలిపివేసిన ప్రభుత్వం… దళిత వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా.. స్వరాజ్ మైదానంలో నిర్మించాలని నిర్ణయించింది. అయితే..ఇదంతా రాజకీయమేనని.. కోర్టు వివాదాల్లో ఉన్న స్వరాజ్ మైదానంలో ఎలా విగ్రహాన్ని నిర్మిస్తారని.. టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ స్థలానికి చెందిన వివాదాలను ఈ ప్రభుత్వం పూర్తిగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

బందరు రోడ్‌లో ఉన్న స్వరాజ్ మైదానం… అత్యంత విలువైనది. అక్కడ వివిధ రకాల ఎగ్జిబిషన్లు.. మార్కెట్లు… ఇతర ప్రజా సంబంధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. నిధుల సేకరణలో భాగంగా బిల్డ్ ఏపీ అంటూ.. కొన్ని ఆస్తులను అమ్మాలనుకున్న ఏపీ సర్కార్.. మొదట్లో ఈ భూమిని కూడా.. జాబితాలో చేర్చింది. తర్వాత న్యాయవివాదాలు లేదా.. ప్రజాగ్రహం వస్తుందని భావించారేమో కానీ వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ స్థలంలో.. అంబేద్కర్ స్మృతి వనం నిర్మిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close