అజిత్‌ని ఢీ కొట్ట‌బోతున్న‌కార్తికేయ‌

‘ఆర్‌.ఎక్స్ 100’తో ఓ సూప‌ర్ హిట్ కొట్టాడుకార్తికేయ‌. ఆ త‌ర‌వాత త‌న‌కు చాలామంచి అవ‌కాశాలొచ్చాయి. కానీ.. ఆ ఫామ్ కి కొన‌సాగించ‌లేక‌పోయాడు. అయితే ఇప్ప‌టికీ త‌న‌కు అవ‌కాశాల‌కు కొద‌వ‌లేదు. తాజాగా త‌మిళ ప‌రిశ్ర‌మ నుంచి కూడా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అజిత్ సినిమాలో కార్తికేయ‌కు ఓ సూప‌ర్ ఛాన్స్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం అందుతోంది. అజిత్ హీరోగా ‘వలిమై’ అనే చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో ప్ర‌తినాయ‌కుడి పాత్ర కార్తికేయ ద‌క్కించుకున్న‌ట్టు టాక్‌. అజిత్ సినిమా అంటే.. ఎవ‌రూ వ‌దులుకోరు. పైగా త‌మిళంలో పాతుకుపోయే గొప్ప స‌ద‌వ‌కాశం ఇది. అందుకే కార్తికేయ ఏమాత్రం ఆలోచించ‌కుండా ఓకే అనేశాడ‌ని టాక్.

‘గ్యాంగ్ లీడ‌ర్‌’లో నూ కార్తికేయ విల‌న్‌గా న‌టించాడు. అందులో కార్తికేయ‌న న‌ట‌న‌, హావ‌భావాలూ బాగున్న‌ప్ప‌టికీ, కార్తికేయ క‌ష్ట‌ప‌డిన‌ప్ప‌టికీ ఫ‌లితం రాలేదు. కానీ అజిత్ పై న‌మ్మ‌కంతో మ‌రోసారి ఆరిస్క్ నెత్తిమీద వేసుకున్నాడు. ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి. ప్ర‌స్తుతం `చావు క‌బురు చ‌ల్ల‌గా`లో హీరోగా న‌టిస్తున్నాడు కార్తికేయ‌. త‌మిళ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close