వ‌ర్మ‌పై మ‌రో సినిమా… ‘ప‌రాన్న‌జీవి’

అంద‌రి వ్య‌క్తిగ‌త జీవితాల్లో వేలు పెట్టి – వినోదం చూస్తుంటాడు రాంగోపాల్ వ‌ర్మ‌. కాదేదీ క‌విత‌ను అన‌ర్హం అన్న‌ట్టు.. ఏ అంశ‌మైనా, ఎవ‌రి జీవితమైనా త‌న సినిమాల‌కు క‌థా వ‌స్తువుగా మారిపోతుంటుంది. వ్య‌క్తులు, సంఘ‌ట‌న‌ల‌పై సినిమాలు తీయ‌డంలో ఆయ‌న దిట్ట‌. ఇప్పుడూ అదే ప‌నిచేస్తున్నాడు. అలాంటి వ‌ర్మ‌పైనే ఓ సినిమా తీస్తే…? జొన్నవిత్తుల అదే ప‌నిచేస్తున్నారు. ‘ఆర్జీవి’ అంటూ ఓ ప్రాజెక్టు మొద‌లెట్టారు. అయితే అది ఎంత వ‌ర‌కూ వ‌చ్చిందో తెలీదు గానీ, ఇప్పుడు వ‌ర్మ‌పై మ‌రో సినిమా రాబోతోంది. అదే.. `ప‌రాన్న‌జీవి`.

ప‌వ‌న్ అభిమానులు కొంత‌మంది క‌లిసి ఈ ప్రాజెక్టు డిజైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ పై ఇప్పుడు వ‌ర్మ `ప‌వ‌ర్ స్టార్‌` అనే సినిమా తీస్తున్నాడు క‌దా? దానికి ఇది సెటైర్ అన్న‌మాట‌. వ‌ర్మ కెరీర్ ఎలా మొద‌లైంది? ఎలా ప‌త‌న‌మైంది? వాడ్కా ముచ్చ‌ట్లు, త‌న వ్య‌క్తిత్వం.. ఇవ‌న్నీ క‌ల‌బోసి ఈ సినిమా సిద్ధం అవుతోంద‌ట‌. ఇది కూడా ఓటీటీలోనే విడుద‌ల కానుంది. స‌రిగ్గా వ‌ర్మ స్టైల్ లోనే ఈ సినిమా తీస్తున్నార్ట‌. వ‌ర్మ‌పై వ‌ర్మే సినిమా తీసుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉండ‌బోతోంద‌ట. వ‌ర్మ‌లా క‌నిపించే ఓ జూనియ‌ర్ ఆర్టిస్టుని కూడా వెదికి ప‌ట్టుకున్నారు. దానికి సంబంధించిన డిటైల్స్ త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ మంత్రుల పేషీల నుంచి ఒక్క ఫైల్ బయటకు పోకుండా తాళాలు !

తెలంగాణలో ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మంత్రుల కార్యాలయాల నుంచి కీలక ఫైళ్లు వాహనాల్లో తీసుకెళ్లిన విషయం గగ్గోలు రేగింది. ఏపీలో అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ...

చిహ్నంలో భాగ్యలక్ష్మి టెంపుల్… బండి ట్వీట్ సారాంశం ఇదేనా..?

తెలంగాణ అధికారిక చిహ్నం మార్పును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా బీజేపీ ఎలాంటి వైఖరిని ప్రకటించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాలన్నీ ఈ అంశం చుట్టూనే తిరుగుతుంటే బీజేపీ మాత్రం మౌనం...

డేరాబాబా నిర్దోషి – అన్యాయంగా జైల్లో పెట్టేశారా !?

డేరాబాబా గురించి కథలు కథలుగా దేశమంతా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన నిర్దోషి అని హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. తన మాజదీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో...

సజ్జల అల్లర్ల హింట్ – మీనా అరెస్టుల వార్నింగ్

కౌంటింగ్ కేంద్రాల్లో అలజడి రేపతామని వైసీపీ నేతలు హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఖచ్చితంగా ఘర్షణ జరుగుతుందని పేర్ని నాని ముందే హెచ్చరించారు. పోలింగ్ ఏజెంట్లకు సజ్జల కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close