రాజధానులపై బీజేపీ విధానాన్ని డిసైడ్ చేసిన విజయసాయిరెడ్డి..!

భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయడానికి.. కన్నా లక్ష్మినారాయణను చాలా ప్లాన్డ్‌గా వాడుకుంటున్నారు విజయసాయిరెడ్డి. తాజాగా మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించవద్దంటూ.. కన్నా లక్ష్మినారాయణ లేఖ రాశారు. దీన్ని ట్విట్టర్‌లో ప్రశ్నించిన విజయసాయిరెడ్డి … చంద్రబాబు తొత్తు కన్నా లక్ష్మినారాయణ అని డిసైడయిందని.. తేల్చేశారు. ఎలా అంటే… మూడు రాజధానులపై బీజేపీ అభిప్రాయానికి భిన్నంగా.. కన్నా లక్ష్మినారాయణ… గవర్నర్‌కు లేఖ రాశారట. అందుకే.. కన్నా హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారట. బహుశా.. తాము కన్నాపై ఆగ్రహం వ్యక్తం చేశామని.. బీజేపీ హైకమాండ్ నేరుగా విజయసాయిరెడ్డికి చెప్పిందేమో కానీ.. ఆయన ట్వీట్ చేసేశారు. నిజానికి మూడు రాజధానులకు వ్యతిరేకమని బీజేపీ చెబుతోంది. అయితే.. రాష్ట్ర పరిధిలోని అంశమని ట్విస్ట్ ఇస్తోంది. అయినప్పటికీ విజయసాయిరెడ్డి అడ్వాంటేజ్ తీసుకుని.. బీజేపీ విధానాన్ని డిసైడ్ చేస్తున్నారు.

కన్నాపై విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌కు మరో నేత లంకా దినకర్ కౌంటర్ ఇచ్చారు. రఘురామకృష్ణరాజు .. ఏదో ఒకటి మాట్లాడినప్పుడల్లా… విజయసాయిరెడ్డి ఇలాంటి వేషాలు వేస్తూంటారని మండిపడ్డారు. అసలు చంద్రబాబు తొత్తు విజయసాయిరెడ్డినేనని.. పిచ్చి సలహాలిచ్చే.. జగన్ ను ముంచేస్తున్నారని మండిపడ్డారు. మరో వైపు కన్నా కూడా.. కౌంటర్ ఇచ్చారు కానీ.. చంద్రబాబు హయాంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని పుస్తకాలేశారని.. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. బీజేపీ అంతర్గత విషయాల్లో… విజయసాయిరెడ్డి జోక్యం చేసుకోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ పలుమార్లు.. కన్నాను టార్గెట్ చేస్తూ.. తీవ్ర విమర్శలు చేశారు.

అయితే.. కన్నాను విజయసాయిరెడ్డి టార్గెట్ చేసినప్పుడు.. బీజేపీలోని ఇతర నేతలెవరూ స్పందించడం లేదు. సాక్షాత్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిపైనే.. దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నా.. ఇతర నేతలు సపోర్ట్‌గా రావడం లేదు. విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధపడటం లేదు. మరీ దారుణమైన విమర్శలు చేసినప్పుడు… మొక్కుబడిగా.. సునీల్ ధియోధర్ లాంటి వాళ్లు… హెచ్చరికల ట్వీట్లు చేస్తున్నా… దాన్ని విజయసాయిరెడ్డి పట్టించుకోవడం లేదు. మళ్లీ మళ్లీ… విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కేంద్ర బీజేపీ.. వైసీపీకి అనుకూలంగా ఉందని.. అందుకే… రాష్ట్ర నేతల్ని వైసీపీ అవమానించినా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయంలో కొంత మంది నేతలు ఉన్నారు. అందుకే.. విజయసాయిరెడ్డి.. చివరికి బీజేపీ విధానాల్ని కూడా డిసైడ్ చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close