ఆ బాలిక భవిష్యత్‌కు అండగా టీడీపీ..!

రాజమండ్రిలో సామూహిక అత్యాచానికి గురైన బాలికకు అండగా ఉండాలని.. పార్టీ తరపున ఆమెను దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. బాగా చదివించి ఆమెకు ఓ దారి చూపించాలని.. భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం… దళిత బాలికను కొంత మంది సామూహికంగా నాలుగు రోజుల పాటు అత్యాచారం చేసి.. పోలీస్ స్టేషన్ ముందు విడిచి పెట్టారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. టీడీపీ నేతలు.. నిజనిర్ధారణ బృందంగా ఏర్పడి.. జరిగిన ఘటనపై పూర్తి సమాచారాన్ని చంద్రబాబుకు నివేదిక రూపంలో ఇచ్చారు.

ఆ బాలిక పదో తరగతి చదువుకుందని తెలియడంతో.. పార్టీ తరపున దత్తత తీసుకుని ఆమెను చదివించాలని నిర్ణయించారు. అలాగే రూ. రెండు లక్షల ఆర్థిక సాయాన్ని కూడా పార్టీ తరపున అందించాలని నేతలను ఆదేశించారు. బాధితురాలిలో ఆత్మవిశ్వాసం కలిగించాలని ఇటువంటి దుర్మార్గాలపై పోరాడే యోధురాలిలా ఆమెను తీర్చిదిద్దాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందని చంద్రబాబు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున ఆర్థికంగా వెనుకబడిన పార్టీ కార్యకర్తల పిల్లలను చదివిస్తూ ఉంటుంది. హైదరాబాద్ గండిపేటలో స్కూల్ , కాలేజీలు కూడా ఉన్నాయి. అక్కడ ఆ బాలికను చదివించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో దళిత వర్గంపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఎక్కువగా ఈ ఘటనల్లో పోలీసులే నిందితులుగా తేలుతున్నారు. రాజమండ్రి బాలిక విషయంలో… పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించగా.. యువకుడి శిరోముండనం ఘటనలో… పోలీసులే నిందితులయ్యారు. వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సి వచ్చింది. చీరాలలో పోలీసులే మాస్క్ పెట్టుకోలేదని.. దళిత యువకుడ్ని కొట్టడంతో చనిపోయారు. అన్నీ వరుసగా దళితులపైనే దమనకాండ జరుగుతూండటంతో… అణిచి వేయడానికే ఇలా చేస్తున్నారని.. దళిత సంఘాలు.. విపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close