మిషన్ బిల్డ్‌లో అమ్మకానికి సీడ్ క్యాపిటల్ ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్మించడానికి సిద్ధంగా లేదు కానీ… ఆ భూముల్ని… భవనాల్ని ఎక్కడికక్కడ అమ్మేసి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన మాత్రం చాలా చురుగ్గా చేస్తోంది. గతంలో బొత్స సత్యనారాయణ… అధికారులు, ఎమ్మెల్యేల కోసం కట్టిన ఇళ్లను… పరిశీలించినప్పుడు.. వాటిని అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారన్న విషయం బయటకు వచ్చింది. తాజాగా.. అమరావతిలో అభివృద్ధి చేయాలనుకున్న స్టార్టప్ ఏరియా కోసం కేటాయించిన పదహారు వందల ఎకరాలను కూడా.. మిషన్ బిల్డ్‌లో భాగంగా అమ్మేయాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఈ విషయాన్ని నేరుగా హైకోర్టుకే తెలిపింది.

గత ప్రభుత్వం.. సింగపూర్ కన్సార్షియంతో కలిసి.. స్టార్టప్ ఏరియాను అభివృద్ది చేయాలనుకుంది. చుట్టూ నగరాన్ని అభివృద్ధి పరచడానికి.., వ్యాపార.. వాణిజ్య కేంద్రంగా మార్చడానికి సీడ్ క్యాపిటల్ ఆలోచన తీసుకు వచ్చారు. 1691 ఎకరాలలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 3 దశల్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి పరచాలనుకుంది. అమరావతి అభివృద్ధి సంస్ధతోపాటు ఏర్పాటైన సింగపూర్‌ కన్సార్టియంలు ఒప్పందం చేసుకున్నాయి. పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడి, వైసీపీ అధికారంలోకి రావడంతో పనులన్నీ ఆగిపోయాయి. ఒప్పందాల్ని కూడా ప్రభుత్వం రద్దు చేసుకుంది.

అయితే.. ఇప్పుడు ఆ భూముల్ని ప్రభుత్వం అమ్మి సొమ్ము చేసుకోవాలనుకోవడమే విశేషం. ఎందుకంటే.., రాజధానిని నిర్మిస్తే… రూ. లక్ష కోట్లకుపైగా ఆదాయం వచ్చే సంపద సమకూరుతుందని …. గత ప్రభుత్వం అమరావతి విజన్ డాక్యుమెంట్‌లో స్పష్టంగా చెప్పింది. అయితే.. అమరావతి నిర్మాణమే చేసే ఆలోచన లేని ప్రభుత్వం.. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్ని మాత్రం… అమ్మాలనే ఆలోచన చేయడానికి ఏ మాత్రం మొహమాటపడలేదు. ఓ వైపు.. కొన్ని భూముల్ని… ఇళ్ల స్థలాల పేరుతో.. మరో వైపు.. నేరుగా సీడ్ క్యాపిటల్ భూముల్నే ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం… అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

అసలు అమరావతినే కట్టబోమని చెబుతున్న ప్రభుత్వం.. ఆ భూముల్ని అమ్మాలనుకోవడం.. పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేస్తారని అనుకోవడం ఏమిటనే సందేహం కూడా చాలా మందికి వస్తోంది. రైతులకు ఇవ్వాల్సిన కౌలు కూడా ఇంత వరకూ ఇవ్వలేదు. కానీ వారి భూముల్ని మాత్రం ఇష్టారీతిన అమ్మకాలు.. పంపకాలు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close