ర‌వితేజ స్ట్రాట‌జీ అదే

ర‌వితేజ‌… ఈ హీరో హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. `రాజా ది గ్రేట్‌` త‌ర‌వాత‌.. ర‌వితేజ‌కి అన్నీ ఫ్లాపులే. అలాంటిలాంటి ఫ్లాపులు కాదు. వ‌రుస‌గా డిజాస్ట‌ర్లు. మామూలుగా అయితే.. ఇన్ని ఫ్లాపులు మ‌రెవ‌రికైనా వ‌స్తే కెరీర్ ఖ‌ల్లాస్ అయ్యేది. అటు వైపు ద‌ర్శ‌క నిర్మాత‌లు క‌న్నెత్తి కూడా చూసేవాళ్లు కాదు. కానీ…. ర‌వితేజ విష‌యంలో అలా జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు మాస్ రాజా చేతిలో ఏకంగా 5 ప్రాజెక్టులున్నాయి. క్రాక్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. న‌క్కిన త్రినాథ‌రావు తో ఓ సినిమా చేయాలి. ర‌మేష్ వ‌ర్మ క‌థ రెడీ చేసుకున్నాడు. వ‌క్కంతం వంశీ ప్రాజెక్టు ఓకే అయ్యింది. ఇది కాకుండా మ‌రో రీమేక్ రెడీ అవుతోంది.

ఏక కాలంలో ఇన్ని సినిమాలు ఓకే చేసుకున్న హీరో ర‌వితేజ‌నే. అందులోనూ.. వ‌రుస ఫ్లాపుల మ‌ధ్య‌. అలాగ‌ని ర‌వితేజ పారితోషికం ఏమీ త‌గ్గించ‌లేదు. రిబేట్లూ ఇవ్వ‌లేదు. కానీ.. ద‌ర్శ‌కులంతా ర‌వితేజ‌నే కావాలంటున్నారు. దానికి కార‌ణం.. ర‌వితేజ టైమ్ సెన్స్‌. సినిమాని చాలా త్వ‌ర‌గా పూర్తి చేయ‌గ‌ల‌డు ర‌వితేజ‌. పైగా ర‌వితేజ సినిమా అంటే హిందీ డ‌బ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్‌కి కొద‌వ ఉండ‌దు. అన్నిటికంటే ముఖ్యంగా.. మిగిలిన హీరోలంతా ఇప్పుడు బిజీ. స్టార్ హీరోలెవ‌రూ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అందుబాటులో లేరు. అర్జెంటుగా ఓ సినిమా తీసేద్దాం.. అనుకున్న‌వాళ్లంద‌రికీ రెడీమెడ్ గా దొరికే హీరో ర‌వితేజ‌నే. డైరెక్ట‌ర్లూ, ప్రొడ్యూస‌ర్ల‌తో ర‌వితేజ పెట్టుకునే ఎటాచ్‌మెంట్ వేరుగా ఉంటుంది. ఫ్లాపుల‌లో ఉన్న ద‌ర్శ‌కుడైనా స‌రే – క‌థ చెబుతానంటే రెడీగా ఉంటాడు. ఎన్ని విధాల చూసినా.. ర‌వితేజ కంఫ‌ర్ట్ అని ద‌ర్శ‌కుల అభిప్రాయం. అందుకే.. ఇన్ని ఫ్లాపులు వ‌స్తున్నా, ర‌వితేజ సినిమాల్ని సంపాదించుకోగ‌లుగుతున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close