అత‌డు వ‌చ్చి.. ప‌దిహేనేళ్లు!

అత‌డు.. ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ స‌త్తా చెప్పిన చిత్ర‌మ్‌. మ‌హేష్ స్టైలీష్ న‌ట‌న‌ని చూపించిన సినిమా. మేకింగ్‌లో.. కొత్త పుంత‌లు తొక్కించిన సినిమా. ఇప్ప‌టికీ.. ఆ సినిమా గురించి మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. టీవీల్లో ఎన్నిసార్లు వ‌చ్చినా చూస్తూనే ఉంటారు. అందులోని డైలాగుల‌న్నీ… సినీ అభిమానుల‌కు కంఠ‌తా వ‌చ్చు. అందుకే… అదో క్లాసిక్ అయ్యింది. ఈ సినిమా విడుద‌లై నేటికి… 15 ఏళ్లు.

నిజానికి ఈ క‌థ మ‌హేష్‌కోసం రాసుకున్న‌ది కాదు. అంత‌కు ముందే.. ఈ సినిమా క‌థ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కి వినిపించాడు త్రివిక్ర‌మ్. క‌థ చెబుతున‌ప్పుడు ప‌వ‌న్ నిద్ర‌పోయాడ‌ట కూడా. అందుకే.. ప‌వ‌న్‌తో తీయాల్సిన `అత‌డు`… మ‌హేష్ చేతికి వెళ్లింది.

అత‌డుని ఇప్పుడంటే క్లాసిక్ అనుకుంటున్నాం గానీ, విడుద‌లైన‌ప్పుడు జ‌నాల‌కు పెద్ద‌గా ఎక్క‌లేదు. వ‌సూళ్లు బాగాన్నా, బ్రేక్ ఈవెన్ రావ‌డం క‌ష్ట‌మైంది. కానీ టీవీల్లోకి వ‌చ్చాక మాత్రం.. చూసిన సినిమానే మ‌ళ్లీ చూడ‌డం మొద‌లెట్టారు. `మా` టీవీలో ఎప్పుడొచ్చినా ఈ సినిమాకి రేటింగ్స్ అదిరిపోతుంటాయి. “అత‌డు సినిమా టీవీల్లో చూశాక‌.. క్లాసిక్ అన్నారు. థియేట‌ర్లోనూ ఆ రేంజులో జ‌నం చూస్తే బాగుండేది“ అని త్రివిక్ర‌మ్ అప్పుడ‌ప్పుడూ బాధ‌ప‌డుతుంటారు. కాక‌పోతే.. ఓవ‌ర్సీస్‌లో త్రివిక్ర‌మ్ సినిమాల‌కు మంచి పునాది వేసిన సినిమా ఇది. అప్ప‌టి నుంచీ.. త్రివిక్ర‌మ్ సినిమా అంటే… ఓవ‌ర్సీస్‌లో మంచి రేట్లు ప‌ల‌క‌డం ప్రారంభ‌మైంది.

వార‌సుడొచ్చాడు సినిమా క‌థ‌కీ.. అత‌డుకీ ద‌గ్గ‌ర పోలిక‌లు ఉంటాయి. మ‌ధుబాబు రాసిన షాడో లో కొన్ని స‌న్నివేశాల స్ఫూర్తితో.. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ రాసుకున్నాడు త్రివిక్ర‌మ్‌. అందుకోసం త్రివిక్ర‌మ్ మ‌ధుబాబుని క‌లిసి ఆయ‌న అనుమ‌తి కూడా తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close