కొత్త సెక్రటేరియట్‌లో సీఎంగా బాధ్యతలు తీసుకునే కేటీఆరేనా..?

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు…కేటీఆర్ పట్టాభిషేకానికి మెల్లగా రంగం సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ఎక్కువగా ఫాంహౌస్‌కే పరిమితమవుతున్నారు. పాలనా వ్యవహారాలన్నీ ఇప్పటికే కేటీఆర్ చూస్తున్నారు. చురుగ్గా పర్యటిస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ” డమ్మీ” కేబినెట్ భేటీని కూడా నిర్వహించారు. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలను పంపేశారు.

సీఎం కేసీఆర్ ఏం చేయాలనుకున్నా.. ఓ పద్దతి ప్రకారం చేస్తారు. ముందుగా ప్రజల్లోకి సందేశం పంపుతారు. ప్రజల్లో వచ్చే రియాక్షన్‌ను బట్టి తదుపరి అడుగులు వేస్తారు. ఆ సందేశాన్ని కేటీఆర్ విషయంలో చాలా కాలంగా పంపుతున్నారు. మొదటి సారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.. కేటీఆర్‌కు బాధ్యతలిస్తారని ప్రచారం చేశారు. ప్లీనరీలో తీర్మానం చేయబోతున్నారని చెప్పుకున్నారు. అప్పటి నుంచి ఏదో ఓ సందర్భంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి.. కేటీఆర్‌కు బాధ్యతలివ్వబోతున్నారని ప్రచారం జరుగుతూనే ఉంది. కేసీఆర్ అనుకున్నప్పుడల్లా.. ఈ ప్రచారం జరుగుతోంది. అంటే.. ఓ విధంగా.. కేసీఆర్ ఎప్పుడైనా వైదొలిగి.. కేటీఆర్‌కు బాధ్యతలివ్వొచ్చు అని ప్రజల్లో.. టీఆర్ఎస్ క్యాడర్‌నూ మానసికంగా సిద్ధం చేస్తున్నారని అనుకోవాలి. ఆ ప్రక్రియ ఇప్పుడు చివరి దశకు వచ్చినట్లుగా అనుకోవచ్చు.

ప్రస్తుతం తెలంగాణ కొత్త సెక్రటేరియట్ అన్ని హంగులతో.. తెలంగాణ సాంస్కృతిక వైభవం కళ్లకు కట్టినట్లుగా సిద్ధమవబోతోంది. ఆరు నెలల్లో… ఆ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బహుశా.. కొత్త సెక్రటేరియట్‌లో సీఎంగా బాధ్యతలు తీసుకుని కేసీఆర్ కాదని.. కేటీఆర్ అని.. అందుకే.. ఇప్పుడు కేటీఆర్ మరింత యాక్టివ్‌గా ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ మదిలో ఏముందో కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం… ఖచ్చితంగా మార్పు ఉంటుందని భావిస్తున్నారు. అందుకే పోటీ పడి.. కేటీఆర్‌ను ప్రసన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్నటి పుట్టిన రోజు వేడుకల్లోనే ఆ విషయం తేట తెల్లమయింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో.. కేటీఆర్ మరింత కీలకమైన బాధ్యతల్లోకి వెళ్లడం ఖాయమనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close