170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే… భారీ పెట్టుబ‌డితో సినిమాలు తీయ‌డానికి రెడీ అవుతున్నాయి. సినిమాల‌కు మించి పెట్టుబ‌డితో.. ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. తాజాగా ఓ ఓటీటీ సంస్థ ఏకంగా 170 కోట్ల‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తోంద‌ట‌. ఇందులో ఓ బాలీవుడ్ సూప‌ర్ స్టార్ న‌టిస్తున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని అల్లు అర‌వింద్ చూచాయిగా చెప్పేశారు. “ఆ హీరో పేరు చెప్ప‌ను. కానీ బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఓ ఓటీటీ సంస్థ కోసం ఓ సినిమా చేస్తున్నారు. దాని బ‌డ్జెట్ 170 కోట్ల‌పైన” అంటూ హింట్ ఇచ్చారు. భ‌విష‌త్తులో ఓటీటీ సంస్థ‌లు ఎంత శ‌క్తిమంతంగా మార‌బోతున్నాయో.. చెప్ప‌డానికి ఇదో ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే.

“ప్ర‌స్తుతం ఓటీటీ హ‌వా న‌డుస్తోంది. కానీ.. ఏదొచ్చినా స‌రే, థియేట‌ర్ల వ్య‌వ‌స్థ‌ని నాశ‌నం చేయ‌లేదు. కేవ‌లం ప్ర‌త్యామ్నాయంగా మాత్ర‌మే నిల‌బ‌డుతుంది. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో సినిమా చూడడాన్నే ఆస్వాదిస్తారు. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు మంచి రోజులు వ‌స్తాయి” అన్న అశాభావం వ్య‌క్తం చేశారు అర‌వింద్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close