ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు… చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ రెండు సినిమాలూ ఫ్లాపే. అయితే ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్ నుంచి ఓ మంచి అవ‌కాశం వ‌చ్చింది. యూవీ క్రియేష‌న్స్ లో కార్తీక్ అనే కొత్త కుర్రాడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోంది. మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈచిత్రంలో కావ్య‌థాప‌ర్ క‌థానాయిక‌. శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. ఇదే కాదు.. మ‌రో నాలుగు చిన్న సినిమాల్ని లైన్ లో పెట్టింది యూవీ క్రియేష‌న్స్‌. ఈ యేడాదే అవ‌న్నీ ప‌ట్టాలెక్క‌బోతున్నాయి. యూవీ కోరుకుంటే.. చాలామంది యువ హీరోలు సినిమాలు చేయ‌డానికి సిద్ధం. కానీ.. ఏరి కోరి శోభ‌న్‌ని ఎంచుకొంది. క‌థ డిమాండ్ చేసిందేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close