ఎం.ఎస్. ధోనీ : భారత క్రికెట్ “నాయకుడు”..!

భారత్‌లో క్రికెట్ ఓ మతం. ఆ మతానికి ఇప్పటి వరకూ చాలా మంది దేవుళ్లు వచ్చారు. కపిల్ దేవ్, సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్ .. ఇలా సీజన్లకు తగ్గట్లుగా మారిపోతున్నారు. ఇప్పటి వరకూ ఆ జాబితాలో ధోనీ ఉన్నాడు. రేపు కోహ్లీ ఉండొచ్చు్. అయితే.. అందరిలోకెల్లా భిన్నంగా ఉండే రియల్ ప్లేయర్ ఎం.ఎస్.ధోని. ఎందుకంటే.. మిగతా వారందరి వ్యక్తిగత రికార్డులు ఘనంగా ఉంటాయి. కానీ.. ధోనీ ఘనమైన రికార్డులు మాత్రం… టీమ్ విజయాలే. భారత విజయాల రికార్డులే.. ధోనీ రికార్డులు. అందుకే.. ఆ తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

జట్టు విజయాలే ధోనీ రికార్డులు..!

ఇండియన్ క్రికెట్ లో ధోనీకి ముందు ఎందరో లెజెండ్స్ ఉన్నారు. ధోనీ అరంగేట్రం చేసే సమయానికి సచిన్ ఇంకా మైదానంలో పరుగులు తీస్తూనే ఉన్నాడు. లాజిక్కులు.. మేజిక్కులు లేకుండా… బ్యాటింగ్‌లో టెక్నికాలిటీస్ వెదుక్కోకుండా… బంతిని బాదడంలో అతని అరవీరభయకర శక్తి ధోనీ నిలబెట్టింది. మొదట్లో మూడు, నాలుగు వన్డేల్లో విఫలం అయినా… విశాఖలో జరిగిన పాకిస్థాన్ వన్డేతో ధోనీ పునాదులు బలంగా వేశాడు. 148 పరుగుల భారీ సెంచరీతో ఇండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆ తర్వాత సిరీస్ లో శ్రీలంకపై 183 పరుగుల అజేయ సెంచరీతో రికార్డుల మోత మోగించి టీమిండియాలో తన కెరీర్ కు తిరుగులేదని చూపించాడు.

బ్యాటింగ్‌లో బాదుడే.. నిర్ణయాల్లో సూపర్ కూల్..!

బ్యాటింగ్‌లో అంత బలంగా.. ఆవేశంగా బాదే ధోనీ.. .నిర్ణయాల్లో మాత్రం.. చెట్టుకు అంటు కట్టినంత స్మూత్‌గా.. కూల్ గా ఉంటారు. అందుకే.. జట్టును సమైక్యంగా నడిపించే నాయకుడు లేక ఓడిపోతున్న టీమిండియాకు… ధోనీ అస్త్రంలా దొరికాడు. అద్భుతమైన ఆటగాళ్లు ఉన్న టీంకు.. నడిపించే నాయకుడు వస్తే.. ఏం జరుగుతుందో టీమిండియా అదే చేసింది. టీమిండియా కొట్టని లక్ష్యంలేదు, ఎక్కని శిఖరంలేదు, ప్రపంచకప్ సహా అన్ని మెగా టోర్నమెంట్లూ గెలిచింది. నెంబర్ వన్ ర్యాంకునూ చేరుకుంది. దీనంతటికి డిఫరెన్స్ ఒక్క ధోనీ మాత్రమే.

నాయకత్వానికి అర్థం చెప్పిన ధోనీ.. !

2007లో జరిగిన టి ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో మొదలైన ధోనీ నాయకత్వం 2011లో భారత్ ను ప్రపంచ విజేతగా నిలిపేదాకా అజేయంగా సాగింది. ధోనీ వ్యక్తిగత రికార్డులు తక్కువగానే ఉంటాయి. దానికి కారణం జట్టు అవసరాలకు అనుగుణంగా ధోనీ తన బ్యాటింగ్ పొజిషన్ ను సవరించుకున్నాడు. మెల్లగా ఆడటం కూడా నేర్చుకున్నాడు. అవసరమైన చోట పాత ధోనీని బయటకు తీసేవాడు. చేజింగ్ లో ప్రపంచ క్రికెట్ లో ద బెస్ట్ ఎవర్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. ధోనీ బ్యాటింగ్ స్టయిలిష్ కాదు.. టెక్నికల్ గానూ యావరేజ్ ప్లేయరే. అయినా ధోనీ వరల్డ్ క్రికెట్ లో ఒక ఐకాన్ లా నిలిచాడు.

భారత క్రికెట్ కీర్తి పతాకను రెపరెపలాడించిన లెజెండ్స్ లో ధోనీ అగ్రస్థానంలో ఉంటాడు. కెరీర్ లో పట్టిందల్లా బంగారంలా మెరిసిన ధోనీ, గొప్ప ఫినిషర్ గా జేజేలు అందుకున్న ధోనీ తన కెరీర్ కు అంతే .. ఎవరూ ఊహించని రీతిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ధోనీ.. భారత క్రికెట్‌లో నాయకుడిగా నిలిచిపోయే క్రికెటర్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close