శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారమే అమరావతి ఎంపిక : కేంద్రం

శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారమే.. అమరావతిని గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించడంపై రైతులు హైకోర్టుకు వెళ్లారు. కొన్ని పిటిషన్లలోకేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చారు. దీనిపై హైకోర్టు జారీ చేసిన నోటీసులకు కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో..ఏపీ రాజధాని వివాదక్రమాన్ని .. చట్టబద్ధంగా ఏం జరిగిందో… స్పష్టంగా వివరించింది.

ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం గతంలో కేంద్ర ప్రభుత్వంలో శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారుసుల మేరకు 2015 ఏప్రిల్ 23వ తేదీన ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం కొత్త రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కూడా మంజూరు చేసింది. రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, మండలి వంటి భవనాల నిర్మాణానికి నిధులు వినియోగించారని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది.

కేంద్రం అఫిడవిట్‌తో రాజధానిగా అమరావతి ఎంపికలో ఎక్కడా లోపాల్లేవని తేలిపోయినట్లయింది. అయితే ఇదే అఫిడవిట్‌లో కేంద్రం కొత్తగా ఏపీ సర్కార్ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటోందని..ఇందు కోసం చట్టాన్ని తయారు చేసే క్రమంలో, దాన్ని ఆమోదించే విషయంలోగాని రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించలేదని స్పష్టం చేసింది. రాజధానులను నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే.. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌లో స్పష్టత కరవైంది. రాజధాలను నిర్ణయించుకోవచ్చు కానీ.. ఇప్పటికే ఉన్న రాజధానులను మార్చొచ్చా లేదా అన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

నామా కేంద్ర మంత్రి – కాంగ్రెస్ కూటమి సర్కార్‌లోనా ?

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎవరితో ఉంటారో ఇంకా ప్రకటించలేదు ..కానీ ఆయన మాత్రం ఓ ప్లాన్ తో ఉన్నారు. నామా నాగేశ్వరరరావును కేంద్ర మంత్రిని చేయాలనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి...

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

ఓటేస్తున్నారా ? : పోలవరం వైపు ఓ సారి చూడండి !

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కరువులో నిండా మునిగిపోవాలో.. కనీసం రైతుల కడుపు నింపుకోవాలో తేల్చుకోవాల్సిన సంధి స్థితిలో ఉంది. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. గతంలో ఓట్లు వేశారు. ఐదేళ్లలో ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close