ఫ్లాష్ బాక్‌: ‘గ్యాంగ్ లీడ‌ర్‌’కి నో చెప్పిన చిరు

1991లో విడుద‌లైన `గ్యాంగ్ లీడ‌ర్‌` చిరంజీవి సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌లొ ఒక‌టిగా నిలిచింది. అప్ప‌టికే చిరు మాస్ హీరో. ఈసినిమాతో ఆ ఇమేజ్ మ‌రింత స్ట్రాంగ్ గా మారింది. విజ‌య‌బాపినీడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే.. ఈ సినిమా క‌థ ముందు చిరంజీవికి న‌చ్చ‌లేదు. దాంతో సున్నితంగా తిర‌స్క‌రించారు. చిరు నో చెప్పిన క‌థ‌ని మ్యాజిక్ చేసి, చిరుతో ఓకే అనిపించిన ఘ‌త‌న ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌కి ద‌క్కుతుంది. ఈ సినిమా విజ‌యంలో.. ఈ చ‌రిత్ర‌లో.. వాళ్ల‌ది కీల‌క పాత్ర‌. ఆ ఫ్లాష్ బాక్‌లోకి వెళ్తే.

గ్యాంగ్ లీడ‌ర్ క‌థ చెప్పాక‌.. చిరుకి ఎక్క‌డో తేడా కొట్టింది. ‘ఇలాంటి క‌థ‌లు చాలా వ‌చ్చాయి.. నేను చేయ‌ను..’ అని సున్నితంగా చెప్పేస‌రికి ద‌ర్శ‌కుడు విజ‌య‌బాపినీడుకి ఏం పాలుపోలేదు. స‌రిగ్గా అప్పుడే ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ తో ప‌రిచ‌యం అయ్యింది విజ‌య‌బాపినీడుకి. ఓ రోజు ఓ హోటెల్ లో ప‌రుచూరి సోద‌రుల్ని క‌లిసిన బాపినీడు.. ‘చిరంజీవితో సినిమా చేస్తున్నా`’అన్నారు. దానికి ప‌రుచూరి వాళ్లూ సంతోషించారు. కానీ అదే రోజు సాయింత్రం.. `క‌థ చెప్పా. కానీ చిరంజీవిగారికి న‌చ్చ‌లేదు` అని దిగాలుగా చెప్పేస‌రికి… ‘ఏదీ… క‌థ మాక్కూడా ఓసారి చెబుతారా” అని ప‌రుచూరి సోద‌రులు అడ‌గ‌డంతో చిరంజీవికి చెప్పిన క‌థే.. మ‌ళ్లీ ప‌ర‌చూరి వాళ్ల‌కూ వినిపించారు.

”మాకు మూడు రోజులు టైమ్ ఇవ్వండి. ఈ క‌థ‌కి ఏం చేయాలో.. అది చేస్తాం” అని ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌.. బాపినీడుని కూల్ చేశారు.

స‌రిగ్గా నాలుగురోజుల‌కు చిరంజీవికి ఫోన్ చేసి `బాపినీడు మీకు ఓ క‌థ చెప్పార్ట క‌దా… అది ఈసారి మీకు చెబుతాం.. వింటారా` అని రిక్వెస్ట్ చేశారు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌.

”ఇది వ‌ర‌కే విన్న క‌థ క‌దా. ఇప్పుడు కొత్త‌గా ఏం చెబుతారు.. వ‌ద్దు” అని చిరంజీవి అన్నాస‌రే… ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ వ‌ద‌ల్లేదు. ”ఈ ఒక్క‌సారి వినండి..” అని స‌ర్ది చెప్పేస‌రికి. ప‌రుచూరి వాళ్ల‌పై న‌మ్మ‌కంతో చిరు ఓకే అన్నాడు.

స‌రిగ్గా మ‌ళ్లీ రెండ్రోజుల‌కు చిరుతో సిట్టింగ్. ఈసారి బాపినీడు చెప్పిన క‌థ‌నే.. కాస్త స‌న్నివేశాలు అటూ ఇటూ చేసి చిరంజీవికి వినిపించారు. విజ‌య‌శాంతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. ప‌రుచూరి వాళ్ల క్రియేష‌న్స్‌. ఇది వ‌ర‌కు బాపినీడు రాసుకున్న క‌థ‌లో.. ముర‌ళీ మోహ‌న్ తో పాటు, హీరో గ్యాంగ్ కూడా చ‌నిపోతుంది. కానీ. ప‌రుచూరి వాళ్లు హీరో గ్యాంగ్ ని చంప‌కుండా అలా వ‌దిలేశారు. ”గ్యాంగ్ చ‌నిపోతే.. గ్యాంగ్ లీడ‌ర్ ఉండ‌డు. ఆ టైటిల్ కి అర్థం ఉండ‌దు” అని ఆయా సన్నివేశాల్ని మార్చి వినిపించారు. ఈ సిట్టింగ్ లోనే.. `చేయి చూశావా ఎంత ర‌ఫ్ గా ఉందో.. ర‌ఫ్ఫాడించేస్తా` అనే మ్యాన‌రిజం కూడా పుట్టింది. చిరు జైలుకి వెళ్ల‌డం, అక్క‌డ కైకాల స‌త్య‌నారాయ‌ణ అనే జైల‌ర్ పాత్ర‌.. ఇవన్నీ ప‌రుచూరి వాళ్లు సృష్టించిన‌వే.

ఇలా అటూ ఇటూ మార్చి గ్యాంగ్ లీర‌డ్ క‌థ చెప్ప‌డంతో.. చిరుకి న‌చ్చేసింది. ప‌క్క‌న పెట్టేసిన క‌థ‌ని చిరు ఓకే చేసేశారు. అప్ప‌టి నుంచే… రిజ‌క్ట్ అయిన క‌థ‌ల్నీ ప‌రుచూరి వాళ్లు రిపేరు చేసి, హిట్టు కొట్ట‌గ‌ల‌రు అనే పేరు తెచ్చుకున్నారు.

ప‌రుచూరి సంభాష‌ణ‌లు, చిరు మేన‌రిజ‌మ్స్‌, బ‌ప్పీల హ‌రి సంగీతం, స్టెప్పులు, చిరు వేసిన రంగు రంగుల పూల చొక్కాలూ.. ఇవ‌న్నీ క‌లిసి ఈ సినిమాకి కొత్త ఆక‌ర్ష‌ణ‌లు తీసుకొచ్చాయి. దాంతో.. చిరు సూప‌ర్ హిట్ చిత్రాల్లో ఇదొక‌టిగా నిలిచిపోయింది.

చిరు పుట్టిన రోజునే ఈ సినిమా వంద రోజుల పండ‌గ‌ను తిరుప‌తి, హైద‌రాబాద్‌, ఏలూరు, విజ‌య‌వాడ‌ల‌లో నిర్వ‌హించారు. ప్ర‌త్యేక విమానంలో చిత్ర‌బృందం ఆయా ప్రాంతాల‌కు చేరుకుని, అభిమానుల్ని క‌లుసుకుంది. ఈ వేడుక‌ల్ని.. `అప్పుల అప్పారావు` సినిమాలోనూ వాడుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇక నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ బంద్… ఎందుకంటే..?

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇక నుంచి టీకాను ఉత్పత్తి చేయబోమని స్పష్టం చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు సమర్ధవంతమైన టీకాలు అందుబాటులోకి వచ్చినందున ఇక తమ వ్యాక్సిన్ అవసరం లేదని...

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close