జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందేనని మోడీకి కేసీఆర్ లేఖ..!

చట్టం ప్రకారం.. జీఎస్టీ బకాయిలు మొత్తం చెల్లించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారాన్ని తగ్గించడం సరికాదని,, దేశ ప్రయోజనాల దృష్ట్యా గతంలో జీఎస్టీకి మద్దతిచ్చామని గుర్తు చేశారు. చట్టం ప్రకారం రెండునెలలకోసారి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌లో తెలంగాణ ఆదాయం 83శాతం పడిపోయిందని… ఈ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని… వేతనాలు, ఖర్చుల కోసం అప్పులపై ఆధారపడాల్సి వస్తోందని గుర్తు చేశారు. మార్కెట్ బారోయింగ్స్ ద్వారా, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లు, ఓవ‌ర్ డ్రాఫ్ట్ ల ద్వారా ఈ ప‌రిణామాల నుంచి గ‌ట్టెక్కాల్సి వ‌స్తోందన్నారు. ఇది స‌మాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమ‌ని సీఎం కేసీఆర్ లేఖ‌లో పేర్కొన్నారు.

జీఎస్టీ ఫ‌లాలు దీర్ఘకాలికంగా ఉండి.. రాబోయే రోజుల్లో మ‌రిన్ని పెట్టుబ‌డులు రావ‌డానికి ఉపయోగపడతాయని అనుకున్నామని కానీ పరిస్థితి అలా లేదన్నారు. ఏప్రిల్ నుంచి రాష్ర్టాల‌కు జీఎస్టీ ప‌రిహారం అంద‌లేదు. జీఎస్టీ పరిహారం చెల్లించలేమని… రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలంటూ కేంద్రం చెప్పడంపైనా కేసీఆర్ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేసారు. కేంద్రానికి ఉన్న ఆర్థిక వెసులుబాటు రాష్ట్రాలకు లేదని… ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలకు అదనంగా సాయం చేయాల్సిన కేంద్రం.. నిధుల కోత విధించడం తగదన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని గుర్తు చేశారు. రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం మొత్తాన్ని తక్షణం చెల్లించాలని కోరారు. కేంద్రం రుణం తీసుకుని రాష్ర్టాల‌కు పూర్తిగా ప‌రిహారం ఇవ్వాల‌ని కోరారు.

జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం ఇచ్చిన రెండు ఆప్షన్స్‌ను కేసీఆర్ తిరస్కరించినట్లయింది. సోమవారం.. పది రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో హరీష్ రావు భేటీ సందర్భంగా కూడా.. ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు అధికారికంగా కేసీఆర్… కేంద్రం ప్రతిపాదనల్ని తోసి పుచ్చారు. ఒక్క ఏపీ లాంటి రాష్ట్రం మినహా.. మిగతా బీజేపీయేతర రాష్ట్రాలన్నీ… జీఎస్టీ పూర్తి పరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close