పబ్‌జీ పై కేంద్రం వేటు..!

భారత్‌లో పబ్‌జీ వీడియో గేమ్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఓ వైపు చైనా సరిహద్దుల్లో అలజడి రేపుతూండటంతో మరో వైపు సరిహద్దులతో పాటు… చైనీస్ కంపెనీలపైనా..సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకంది. అందుకే.. పబ్‌జీతో పాటు మరో 118 చైనీస్ మొబైల్ అప్లికేషన్స్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్స్‌ను కేంద్రం బ్యాన్ చేసింది. ఈ సారి ఆ జాబితాలోకి పబ్‌జీ చేరింది.

ప్రస్తుతం కేంద్రం విధించిన నిషేధం జాబితాలో అలీ ఎక్స్‌ప్రెస్, లూడో లాంటి యాప్స్ కూడా ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ అన్నీ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల డేటా తస్కరిస్తున్నట్లుగా కేంద్రం గుర్తించింది. చైనాలో సర్వర్లు ఉన్న కంపెనీల నుంచి ప్రభుత్వం ఏ సమాచారాన్ని అయినా తీసుకునేలా చైనా 2017లో చట్టం చేసింది.దీంతో ఈ నేపథ్యంలో భారత్, సహా వివిధ దేశ వినియోగదారుల డేటాపై డ్రాగన్ నియంత్రణలో ఉంటోంది. అక్కడి నుంచి సమాచారం తస్కరిస్తున్నారని కేంద్రం గుర్తించింది.

ఈ సారి నిషేధించిన యాప్‌ల జాబితాలో వీపీఎన్‌లు కూడా ఉన్నాయి. టిక్ టాక్ వీపీఎన్‌ను బ్యాన్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో చైనాకు చెందిన లక్షలాది యాప్‌లు ఉన్నాయి. వాటిలో భారత్‌లో ఎక్కువ వినియోగంలో ఉన్నవి చూసి.. భారత ప్రభుత్వం నిషేధఘిస్తోంది. చైనాను దారిలోకి తీసుకురావాలంటే ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని భారత్ భావిస్తోంది. ఇండియాలానే ఇతర దేశాలు కూడా..చైనీస్ యాప్స్‌ను నిషేధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close