కేంద్రాన్ని కోర్టుకు లాగబోతున్న కేసీఆర్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ పోరాటం ఎంచుకుంటే ఎవరూ ఆపలేరు. ఎదురుగా ఉన్నది కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఆయన దూకుడుగానే వెళ్తారు. కేంద్రం జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో చట్టాన్ని ఉల్లంఘిస్తోందని నిర్ణయించుకున్న ఆయన.. న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. జీఎస్టీ చట్టం ప్రకారం.. ఆదాయం తగ్గిపోయినప్పుడు కేంద్రం రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించాలి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం.. “యాక్ట్ ఆఫ్ గాడ్” పేరుతో ఆ బాధ్యత నుంచి తప్పుకొంది. నిధులు కావాలంటే… ఆర్బీఐ వద్ద అప్పులు తీసుకోవాలని సూచించింది. దీనిపై కేసీఆర్ గుస్సా అవుతున్నారు. కేంద్రం చట్టాన్ని పాటించాల్సిందేనని.. రాష్ట్రాలకు సాయం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఆయన మాటల్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు.

అప్పుల కోసం కేంద్రం షరతులకు లోబడే ప్రశ్నే లేదంటున్న కేసీఆర్.. న్యాయపరంగా నిధులను పొందేందుకు.. పోరాటం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే జీఎస్టీ చట్టం మెత్తాన్ని ఔపాసన పట్టి.. న్యాయనిపుణులతో సంప్రదింపులు కూడా జరిపారు. ఏ క్షణమైనా కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇతర రాష్ట్రాలు కొన్ని సైలెంటవుతున్నా…. కేంద్రం తీరుపై వాటికి కూడా అసంతృప్తి ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలాగూ నోరెత్తలేవు. తాను న్యాయపోరాటం ప్రారంభిస్తే.. ఇతర రాష్ట్రాలు కూడా కలిసి వస్తాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులకు వెళ్లడం…అనూహ్యమే. అదీ కూడా కేంద్రం చట్ట ఉల్లంఘనకు పాల్పడిందని వెళ్లడం అసాధారణమే అవుతుంది. చట్టం ప్రకారం అయితే కేంద్రం.. రాష్ట్రాలకు నిధులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ కేంద్రం ఇవ్వడం లేదు. కేసీఆర్ న్యాయపోరాటం చేసి.. కేంద్రం తప్పనిసరిగా నిధులు ఇవ్వాల్సిందేనని తీర్పు వచ్చేలా చేయగలిగితే.. ఆయనకు జాతీయ స్థాయిలో పేరు వస్తుంది. కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్న జాతీయ రాజకీయానికి ప్లస్ అవుతుంది కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close