అమరావతి కేస్ : ప్రచారంతో పరువు తీస్తే చాలనుకుంటున్నారా..?

అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను టార్గెట్ చేస్తూ… అమరావతి భూముల కేసులు పెట్టడమే కాదు.. దాని గురించి మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రచారాన్ని కూడా.. లీకుల ద్వారా ఉద్ధృతంగా ప్రారంభించిన వైసీపీకి.. షాక్ తగిలింది. తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు.. వివరాలో ఎఫ్‌ఐఆర్ పెట్టడమే కాకుండా.. మీడియాలో.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆ కేసు దర్యాప్తును నిలిపివేయాలని.. మీడియా ట్రైల్‌ను నిలిపివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్‌పై అత్యవసర ఆదేశాలు కూడా తెచ్చుకున్నారు. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ పై రాజధాని భూముల్లో అవకతవకలపై దాఖలు చేసిన ఏసీబీ కేసుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి చర్యలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేిసంది. అలాగే.. ఎఫ్‌ఐఆర్‌లో సమాచారాన్ని మీడియాలో రాకూడదని స్పష్టం చేసింది. అమరావతి భూముల విషయంలో తనపై కుట్ర పూరితంగా ఏసీబీ కేసులు పెట్టారని.. దమ్మాలపాటి శ్రీనివాస్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మేరకు దాఖలు చేసిన హౌస్‌ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. దమ్మాలపాటి తరపున ముకుల్‌ రోహత్గీ, శ్యాందివాన్‌ వాదనలు వినిపించారు. దమ్మాలపాటిని ఇరికించేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే.. అభియోగాలు మోపారని ఆధారాలతో సహా.. హైకోర్టుకు పిటిషనర్‌ తరపు న్యాయవాదులు వివరంచారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు కేసులు పెట్టడం ద్వారా మీడియాలో దుష్ప్రచారం జరిగేలా కూడా కుట్ర పన్నారని..తర్వాత కేసులో ఏమీ లేకపోయినా నష్టం జరిగిపోతుందని దమ్మాలపాటి శ్రీనివాస్ అనుమానిస్తున్నారు. అందుకే.. ఈ కేసు విషయంలో మీడియా ట్రైల్ వద్దని ఆయన కోరారు. ఈ విషయాన్ని కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే మీడియాలో రాకుండా హైకోర్టు ఆదేశాలిచ్చింది.

ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, మిగతా మాధ్యమాల్లో రాకుండా.. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర డీజీపీ, ఐఅండ్‌పీఆర్‌ కమిషనర్‌లకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. మీడియా హౌస్‌లు, సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో.. ఈ కేసుకు సంబంధించిన సమాచారం బయటికి రాకుండా.. గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచారశాఖను కూడా హైకోర్టు ఆదేశించింది. అమరావతి భూములపై ప్రభుత్వం నియమించిన సిట్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని.. ఆ నివేదిక ఆధారంగా దమ్మాలపాటిపై కేసులు పెట్టాలని ఏపీ సర్కార్ ఏసీబీని ఆదేశించింది. ఆ మేరకు కేసు పెట్టింది. కానీ అసలు సిట్ ఏర్పాటు చేయక ముందే దమ్మాలపాటి శ్రీనివాస్‌కు చెందిన ఐటీ రిటర్న్స్‌ను… ఇంటలిజెన్స్ ఎస్పీగా ఉన్న రఘురామిరెడ్డి అధికారిక లేఖ ద్వారా సేకరించారు. ఈ విషయం బయటకు రావడం సంచలనాత్మకం అయింది. ముందస్తు ఓ కుట్ర పూరితంగా వ్యవహారం నడుపుతున్నారని దమ్మాలపాటి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దమ్మాలపాటి శ్రీనివాస్.. తనపై ఏసీబీ పెట్టిన కేసులను విచారణ చేయవద్దని అనడం లేదు. పోలీసులు.. సిట్.. ఏసీబీ అన్నీ తప్పుడు కేసులు పెట్టి.. ఆధారాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి.. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరుతున్నారు. ఈ విషయంలో కోర్టు నిర్ణయం తీసుకుంటే… సంచలనాత్మక మలుపు తిరిగే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ట్యాపింగ్ – దొరికినవాడే దొంగ !

"టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చాక మన ప్రతి కదలికపై మరొకరు నిఘా పెట్టడానికి అవకాశం ఇచ్చినట్లే. తప్పించుకునే అవకాశం లేదు.." కాకపోతే ఈ అవకాశం అధికారం ఉన్న వారికే వస్తుంది....

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close