తెలంగాణ సీబీఐ కోర్టుల్లో దేశంలోనే అత్యంత భారీ అవినీతి “కేసు”..!

అత్యంత తీవ్రమైన నేరాలు చేసిన వారు ప్రజా జీవితంలో కొనసాగుతూ… నేరపూరిత ఆలోచనలతో వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారన్న ఆందోళన దేశవ్యాప్తంగా పెరిగిపోతోంది. అందుకే.. ఇలాంటి నేరాభియోగాలు ఉన్న ప్రజాప్రతినిధులపై ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. దానిపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. నిజానికి 2014 ఎన్నికల ప్రచార సమయంలోనే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా.. అవినీతి నేతలపై విచారణ చేస్తామని ప్రకటించారు. కానీ ఇంత వరకూ అది అమల్లోకి రాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. కేంద్రం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి సిద్ధమయింది. ఏడాదిలో విచారణ పూర్తయ్యేలా కోర్టులను ఏర్పాటు చేయబోతోంది.

ఈ మేరకు సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ అన్ని కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై ఉన్న తీవ్రమైన నేరాభియోగాల జాబితాలను తెప్పించుకుంది. అమికస్ క్యూరీ ఈ సమాచారాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించారు. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి కోర్టులో ప్రజాప్రతినిధులపై 23 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ వివరాలను సుప్రీంకోర్టు నియమించిన అమికస్‌ క్యూరీ సమర్పించిన నివేదికలో వెల్లడించారు. పలు కేసులు 2012-13 నుంచి అపరిష్కృతంగా ఉన్నాయని, ఆరు కేసులపై హైకోర్టు స్టే విధించిందన్నారు. వీటిలో నాలుగు కేసులు డిశ్చార్జి పిటిషన్‌పై విచారణ దశలో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ఎదుట 10 జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన 118 కేసులు ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టుల నుంచి వచ్చిన వివరాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్‌ నేరాలు కాకుండా 175 అవినీతి నిరోధక చట్టం కేసులు, 14 మనీలాండరింగ్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

దేశంలోనే అత్యంత అవినీతి పరమైన కేసు కూడా హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఉంది. ఓ ప్రజాప్రతినిధిపై ఇంత భారీ అవినీతి కేసు దేశంలో మరో చోట లేదు. సుప్రీంకోర్టు పట్టుదలగా… ప్రక్షాళన ప్రారంభిస్తే… సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులపై కేసులు ఉన్నాయి. అవి కూడా ఏడాదిలో తేలిపోతే రాజకీయంగా సంచలనాలు ఖాయమని భావించవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఏపీ రాజధానేదో ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి !

పాలకుడు సొంత రాష్ట్రంపై కుట్రలు చేసుకునేవాడు అయి ఉండకూడదు. సొంత ప్రజల్ని నాశనం చేసి తాను ఒక్కడినే సింహాసనంపై కూర్చుని అందర్నీ పీల్చి పిప్పి చేయాలనే వ్యక్తిత్వం ఉండకూడదు. అలా ఉంటే...

ఎడిటర్స్ కామెంట్ : గుర్తుకొస్తున్నావయ్యా.. శేషన్ !

టీ.ఎన్.శేషన్. ఈ పేరు భారత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్మరించుకుంటూనే ఉన్నారు. గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆయనను మరిపించేలా మాత్రం ఎవరూ రావడం లేదు. ఎన్నికల సంఘం...

నిప్పుల కుంపటిలా తెలంగాణ..

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మరింత ముదురుతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు వేసవి తీవ్రత ఇలాగే ఉంటుందని.. ఎండతోపాటు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ...

రేవంత్ కు హైకమాండ్ అభినందనలు..ఎందుకంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతోన్న అంశాల ఆధారంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతోందని రేవంత్ పని తీరును...

HOT NEWS

css.php
[X] Close
[X] Close