ఏపీ సర్కార్ బాండ్లలోకి శ్రీవారి నిధులు..!

తిరుమల శ్రీవారి సొమ్ము ఇక ప్రభుత్వంలోకి ప్రవహించబోతోంది. బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి మరీ ప్రభుత్వ బాండ్లను కొనాలనే ఆలోచనను టీటీడీ బోర్డు చేస్తోంది. దీనికి కారణం బ్యాంకుల్లో వడ్డీ తక్కువగా వస్తోందట… ప్రభుత్వ బాండ్లలో అయితే.. ఎక్కువగా వడ్డీ వస్తుందట. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ తగ్గుముఖం పట్టడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లుగా టీటీడీ వర్గాలు మీడియాకు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల బాండ్లను కొనుగోలు చేసే యోచనలో ఉన్నామని చెబుతున్నారు. బ్యాంకుల ద్వారా ప్రస్తుతం 3 నుంచి 4 శాతం మాత్రమే వడ్డీ లభిస్తోందని.. అదే బాండ్ల ద్వారా 7 శాతం లభించే అవకాశం ఉందని టీటీడీ ఆర్థిక మేధావులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా డిఫాజిట్లు చేయాలని టీటీడీ భావిస్తోంది. రాబోయే పాలకమండలి సమావేశంలో బాండ్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

చెప్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్లని చెబుతున్నారు కానీ.. టీటీడీ అసలు ఉద్దేశం మాత్రం… ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ సర్కార్ కి శ్రీవారి నిధులు మళ్లించడమేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఏపీ సర్కార్‌కు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. ఆర్బీఐలో తీసుకోవాల్సిన రుణం పరిధి దాటిపోయింది. బ్యాంకులు కూడా.. ఏపీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరు చూసి.. విస్తుపోతున్నాయి. రుణాలిస్తే గోడకు కొట్టిన సున్నం అవతుందేమో అన్న ఉద్దేశంతో రుణ ప్రతిపాదనల పరిశీలన కూడా చేయడం లేదు. ఇప్పుడు… ఆదాయానికి నాలుగైదు రెట్ల ఖర్చును పెట్టుకుంటూ పోతున్న ఏపీ ప్రభుత్వానికి దిక్కుతోచని స్థితి ఏర్పడింది. అందుకే.. శ్రీవారి నిధులు బాగా ఉపయోగపడతాయని అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

శ్రీవారి నిధులను జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేస్తూంటారు. ఇప్పుడు..వాటిని ఉపసంహరించి.., ఏపీ సర్కార్ బాండ్లలో ఎక్కువ వడ్డీకి పెట్టుబడి పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నారని సులువుగానే అర్థమవుతోంది. అదే జరిగితే.. మరోసారి టీటీడీపై తీవ్రమైన వివాదం రేగడం ఖాయమని భావించవచ్చు. ఇప్పిటికే శ్రీవారి భూముల అమ్మకంపై రేగిన వివాదంతో.. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న సమయంలో.. ఇలాంటి తీవ్రమైన నిర్ణయాన్ని టీటీడీ లేదా.. ప్రభుత్వం తీసుకుంటుందా..అన్న చర్చ కూడా జరుగుతోంది. వచ్చే టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ అంశం కీలకం కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : టీవీ9 నుంచి రజనీకాంత్ ఔట్

టీవీ9 నుంచి రజనీకాంత్ నిష్క్రమించారు. తెలుగులో నెంబర్ వన్ చానల్‌గా ఉన్న టీవీ9లో కొద్దిరోజులుగా గ్రూపుల గలాటా సాగుతోంది.రజనీకాంత్, మురళీకృష్ణల మధ్య సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయారు. కొత్త యాజమాన్యం చేతుల్లోకి వచ్చిన...

అమరావతికి మద్దతుగా హైకోర్టులో జనసేన అఫిడవిట్..!

అమరావతి విషయంలో జనసేన పార్టీ తన విధానాన్ని నేరుగా హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో తెలియ చేసింది. మూడు రాజధానులు వద్దే వద్దని అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని సూటిగా జనసేన స్పష్టం చేసింది....

బ్యాటన్ అందుకున్న రోజా ..! పెద్ద ప్లానే..!?

హిందూత్వాన్ని కించ పరుస్తున్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు మాత్రం తగ్గడం లేదు. వివాదాన్ని అంతకంతకూ పెద్దగి చేసుకుంటూ వెళ్తున్నారు అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలతో ఒకరిని మించి మరొకరు...

మోడీ భార్యతో కలిసి పూజలు చేసిన తర్వాతే జగన్‌ను అడగాలి : కొడాలి నాని

భారతీయ జనతా పార్టీపైనా మంత్రి కొడాలి నాని తన టెంపర్ చూపించారు. ప్రధాని మోడీ ముందు తన భార్యను రామాలయనికి తీసుకెళ్లి సతీసమేతంగా పూజలు చేయాలని ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి కుటుంబసమేతంగా...

HOT NEWS

[X] Close
[X] Close