ఫిన్‌సెన్‌ లీక్స్ : వెలుగులోకి కేవీపీ, అదాని సహా ప్రముఖుల “బ్లాక్” హిస్టరీ..!

ఫిన్‌సెన్ లీక్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రపంచంలో కుబేరులనే పేరు సంపాదించిన వారి బ్యాంకుల్లో ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించారో ఈ ఫిన్‌సెన్ లీక్స్ బయట పెడుతోంది. వికిలీక్స్, పనామా పేపర్స్ లాంటిది కాదు.. ఈ ఫిన్‌సెన్‌లీక్స్. అఫీషియల్. ఫిన్‌సెన్ అంటే.. అమెరికా ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్‌ క్రైమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నెట్‌వర్క్‌. ఈ విభాగానికి వివిధ బ్యాంకులు సమర్పించిన అనుమానిత కార్యకలాపాల నివేదిక ద్వారా అక్రమ లావాదేవీలు బట్ట బయలయ్యాయి. బయట దేశాలకు సంబంధించి ఎవరెవరో ఏవో లావాదేవీలు చేస్తే.. మనకేం సంబంధం ఉండదు కానీ.. మన దేశంలోని ప్రముఖుల పేర్లు కూడా ఇందులో ఉండటమే ఇప్పుడు కలకలం రేపుతోంది.

ఫిన్‌సెన్‌ లీక్స్‌లో కేవీపీ రామచంద్రరావు ప్రస్తావన ఉంది. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ.. కేవీపీ రామచంద్రరావుపై కేసు నమోదు చేసింది. టైటానియం ఖనిజ తవ్వకాల అనుమతుల కోసం లంచాలు వసూలు చేశారని.. కేవీపికి సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలను ఎఫ్‌బీఐ.. వెల్లడించింది. బ్యాంకులు కూడా.. వీటి గురించి ఫిన్‌సెన్ లీక్స్‌లో బయటకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి కేవీపీని తమకు అప్పగించాలని అమెరికా 2014లోనే కోరింది. అయితే అప్పట్లో కేవీపీ హైకోర్టులో పిటిషన్ వేసి.. బయటపడ్డారు. ఇప్పుడు మళ్లీ ఫిన్‌సెన్‌ లీక్స్‌లో ఆయన పేరు మార్మోగిపోతోంది. ఎఫ్‌బీఐ తన కేసులో కెవీపీతో పాటు ఆరుగురిని నిందితులుగా పేర్కొంది.

ఒక్క టైటానియం స్కాం అక్రమ లావాదేవీలు మాత్రమే కాదు.. అదానీ గ్రూపు వ్యవహారాలను కూడా ఫిన్‌సెన్ బయట పెట్టింది. సీషెల్స్‌ నుంచి సింగపూర్‌లోని అదానీ గ్లోబల్‌ పీటీఈ సంస్థకు మనీ లాండరింగ్‌ ద్వారా భారీ మొత్తంలో నిధులు బదిలీ అయినట్టు గుర్తించింది. ఫిన్‌సెన్‌కు బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ మెల్లాన్‌ ఈ పత్రాలను సమర్పించినట్లుగా తెలుస్తోంది. అనుమానాస్పద లావాదేవీలన్నింటినీ బ్యాంకులు వెల్లడించాయి. థియోన్‌విల్లే ఫైనాన్షియర్‌ లిమిటెడ్‌ అదే పనిగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ కంపెనీని డొల్ల కంపెనీగా భావించి.. ఆ లావాదేవీలను బ్యాంకులు అనుమానాస్పదంగా గుర్తించాయి. 2013లో బీ థియోన్‌విల్లే ఫైనాన్షియర్‌ లిమిటెడ్‌ సంస్థ వెబ్‌సైట్ ఇంకా అండర్‌ కన్‌స్ట్రక్షన్‌ అని చూపించేది. ఇప్పుడు కూడా ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో అదే ప్రకటనను కొనసాగిస్తోంది. ఇంత కంటే ఏం సాక్ష్యాలు కావాలన్న చర్చ సహజంగానే వస్తుంది. సహజంగానే అందరూ వీటిని ఖండిస్తారు. అదానీ గ్రూప్ కూడా ఖండించింది. కానీ లెక్కలు మాత్రం బయటకు రావాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close