బాలు.. స‌క‌ల క‌ళా వ‌ల్ల‌భుడు

బాలుని ఏమ‌ని వ‌ర్ణించాలి? ఆయ‌న‌లోని ప్ర‌తిభ‌ని ఎంత‌ని చెప్పాలి? బాలు ని కేవ‌లం ఓ గాయ‌కుడిగానే చూళ్లేం. ఆయ‌న అంత‌కు మించి. ఆయ‌న‌లో సంగీత ద‌ర్శ‌కుడు, డ‌బ్బింగ్ క‌ళాకారుడు, న‌టుడు, నిర్మాత‌, వ్యాఖ్యాత ఇలా… ఎంద‌రో ఉన్నారు. ఆయ‌న మంచి మిమిక్రీ ఆర్టిస్టు. ఏ హీరోకి పాట పాడితే, ఆ హీరోకి తగ్గ‌ట్టు.. గ‌ళం విప్ప‌డం బాలుకే సాధ్యం. హీరోల గొంతుల్ని అనుక‌రించ‌డం ఘంట‌సాల నుంచి అబ్బిన విద్య‌. అయితే.. హాస్య న‌టుల గొంతును అనుక‌రించి, త‌న పాట‌తో కిత‌కిత‌లు పెట్టించే కిటుకు.. బాలుకి బాగా తెలుసు. మిమిక్రీ విద్య‌తో ఎన్ని పాట‌ల‌కు విశిష్ట‌త తీసుకొచ్చాడో ? `తాళిక‌ట్టు శుభ‌వేళ‌.. మెడ‌లో మందార మాల‌` పాట చూడండి. బాలు గొప్ప‌దనం అర్థం అవుతుంది. అల్లు గొంతుని అనుక‌రించ‌డంలో బాలు త‌ర‌వాతే ఎవ‌రైనా. అందుకే అల్లుకి పాడిన ప్ర‌తీ పాట హిట్ట‌య్యింది. డ‌బ్బింగ్ విష‌యానికొస్తే.. క‌మ‌ల్ లాంటి విశిష్ట‌మైన న‌టుడికి గొంతు ఇవ్వ‌డం మామూలు విష‌యం కాదు. ఎందుకంటే.. క‌మ‌ల్ శైలి, స్థాయి వేరు. ఆయ‌న న‌ట‌న‌కి మ్యాచ్ అవ్వాలంటే.. అంతే ప్ర‌తిభ ఉన్న న‌టుడు కావాలి. దాన్ని బ‌ట్టి.. బాలులోని న‌టుడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవొచ్చు. తెలుగు భాష‌పై అద్భుత‌మైన ప‌ట్టు, ప్రేమ ఉన్న గాయ‌కుడు బాలు. అందుకే ఆయ‌న మైకు ప‌ట్టుకుంటే.. ఒక్క ఇంగ్లీషు ప‌దం కూడా క‌నిపించ‌దు, వినిపించ‌దు. అలాగ‌ని మిగిలిన భాష‌ల్ని ఆయ‌న త‌క్కువ చేయ‌రు. అన్నీ భాష‌ల్లోనూ పాట‌లు పాడిన గాయ‌కుడు క‌దా. అందుకే ప్ర‌తీ భాష‌పై ప్రేమ ఉంది. ఏ రాష్ట్రానికి వెళ్తే, ఆ భాష‌ని, పొల్లు పోకుండా మాట్లాడ‌డం బాలుకి ఇష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోక్ సభ ఎన్నికలు : బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..?

లోక్ సభ ఎనికల్లో అంచనాలు తలకిందలు కానున్నాయా..? అసలు ఏమాత్రం ప్రభావం చూపదని అంచనా వేసిన బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..? కేసీఆర్ బస్సు యాత్రతో జనాల మూడ్ చేంజ్ అయిందా..? అంటే...

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close