“నీటి వాటా” కేటాయింపే అపెక్స్‌లో కేసీఆర్ ఎజెండా..!

ఆరో తేదీన అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని కేంద్రజలశక్తి శాఖ మంత్రి నిర్ణయించడంతో సమర్థవంతమైన వాదన వినిపించాలని తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ తెలంగాణకు నీటి కేటాయింపులు చేయలేదు. ఇదే అంశాన్ని అపెక్స్ భేటీలో హైలెట్ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి నీటిని కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ అధికారికంగా తెలంగాణకు నీటి కేటాయింపులు లేవు.

తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడితే జూన్ 14న నీటి కేటాయింపులు జరపాలని ప్రధాన మంత్రికి కేసీఆర్ లేఖ రాశారు. ఏపీ, తెలంగాణ మధ్య అయినా.. లేకపోతే నదీపరివాహాల ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరాము. ఏడేళ్లు గడుస్తున్నా స్పందన లేదని కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. అపెక్స్ సమావేశాల పేరిట హడావుడి చేస్తున్నారు కానీ కేంద్రం ఏమీ చేయడం లేదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా ఎండగట్టాలని… తెలంగాణాకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ నదీ జలాల విషయంలో కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటోందని.. కేసీఆర్ పదే పదే చెబుతుననారు. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు ఏపీకి సమాధానం చెప్పాలని నిర్ణయించారు. ఏపీ జలవనరుల శాఖ అధికారులు కూడా తమ వాదన గట్టిగా వినిపించడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల వివరాలతో పాటు తాము కొత్తగా నిర్మించాలనుకున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా… అపెక్స్ కౌన్సిల్ భేటీ కంటే ముందే అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close