టీటీడీ నుంచి సింఘాల్ అవుట్.. జవహర్ రెడ్డి ఇన్..!?

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డిని నియమించనున్నారు. ఇప్పటికి ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేసేశారు. ఆయనను ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో జవహర్ రెడ్డి ఉన్నారు. అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి ప్రస్తుతానికి ఇన్చార్జ్ ఈవోగా కొనసాగుతారు. సింఘాల్‌ను బాధ్యతల నుంచి తక్షణం రిలీవ్ చేస్తారు. అయితే ధర్మారెడ్డి ఈవో అవడానికి సరిపడా క్యాడర్ లేదు. ఆయన ఐఏఎస్ కాదు. అదే సమయంలో జవహర్ రెడ్డి కూడా తనను టీటీడీ ఈవోగా నియమించాలని కోరుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ ఆమోదముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. అంటే టీటీడీకి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి, ఈవోగా జవహర్ రెడ్డి, అదనపు ఈవోగా ధర్మారెడ్డి ఉంటారన్నమాట.

వాస్తవానికి అనిల్ కుమార్ పదవీ కాలాన్ని జూలైలోనే పొడిగించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితులైన కీలక అధికారుల్ని… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే.. తప్పించేసినా.. అనిల్ కుమార్ సింఘాల్ జోలికి మాత్రం వెళ్లలేదు. టీడీపీ హయాంలో .. టీటీడీపై వైసీపీ చేసిన రాజకీయంగా.. అనిల్ కుమార్ సింఘాల్‌పైనా వైసీపీ అగ్రనేతలు ఆరోపణలు చేశారు. వైసీపీ ముఖ్యనేతలపై.. టీటీడీ ఈవో హోదాలో.. రూ. వంద కోట్లకు పరువు నష్టం కేసులు కూడా వేయించారు. దీంతో సింఘాల్‌పై వైసీపీ నేతలకు పీకల దాకా కోపం ఉంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న సింఘాల్‌ను 2017 మేలో చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. చంద్రబాబు సింఘాల్‌ను నియమించే సమయంలో తెలుగు వారికే టీటీడీ పోస్టు ఇవ్వాలనే డిమాండ్లు కూడా వినిపించాయి.

అయితే పై స్థాయి నుంచి సింఘాల్‌కు సపోర్ట్ ఉండటంతో చంద్రబాబు ఓకే చేశారు. మామూలుగా టీటీడీ ఈవో పదవీ కాలం రెండేళ్లే. అది ముగిసిన తర్వాత ప్రభుత్వంతో సంబంధం లేకుండా పొడిగింపు తెచ్చుకున్నారు. కానీ పొడిగింపు ఇచ్చిన రెండు నెలలకే ప్రస్తుత ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది. టీటీడీ ఈవో పోస్టుకు.. ఐఏఎస్ వర్గాల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ తర్వాత ఎవరైనా ప్రధానంగా టీటీడీ ఈవోనే పోస్టునే కోరుకుంటారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాబట్టి జవహర్ రెడ్డి లాంటి అధికారులు.. ఆ స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు ప్రయత్నించి సక్సెస్ అవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలవరం కట్టలేమన్న అనిల్..!

పోలవరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం మెల్లగా చేతులెత్తేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేంద్రం ఆమోదించిన పాత ధరలకు తాము కట్టలేమని.. జనవనరుల మంత్రి అనిల్ కుమార్ మీడియా ముందు తేల్చి చెప్పేశారు. సహాయ, పునరావాసాలకే...
video

ఆకాశం నీ హ‌ద్దురా ట్రైల‌ర్‌:  క‌ల‌ల‌కు రెక్క‌లొచ్చాయి

ఓ సామాన్యుడు. ఫ్లైట్ టికెట్ కూడా కొన‌డానికి డ‌బ్బుల్లేని వాడు, ఏకంగా.. విమానాల వ్యాపార‌మే పెడ‌తానంటే..?  పెట్టి చూపిస్తే..?  ఈ వ్యాపారంలో దిగ్గ‌జాలుగా చ‌లామ‌ణీ అవుతున్న ఎంద‌రినో త‌న వ్యూహాల‌తో కుదేలు చేస్తే..?...

రాజధాని, పోలవరం కట్టేశారు.. ఇక విశాఖ మెట్రో..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అధికారం చేపట్టి.. ఏడాదిన్నర దాటిపోయింది. ఈ లోపులో అమరావతి, పోలవరం కట్టేశారు. ఇప్పుడు విశాఖ మెట్రో కట్టడానికి టెండర్లు పిలవడానికి సిద్ధమవుతున్నారు. మంత్రుల ప్రకటనలు ఇలానే ఉన్నాయి....

ప్రజలతో సంబంధం లేకుండా ఏపీ బీజేపీ బలపడుతుందా..?

కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి... ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏపీలో బీజేపీ బలపడుతుందని.. ఇక అధికారంలోకి రావడమే తరువాయి అన్నట్లుగా ప్రసంగించారు. అంత వరకూ బాగానే...

HOT NEWS

[X] Close
[X] Close