స్వీటీ కెరీర్‌కి స్పీడ్ బ్రేక‌ర్‌

భాగ‌మ‌తి త‌ర‌వాత‌… అనుష్క నుంచి సినిమా ఏదీ రాలేదు. ‘నిశ్శ‌బ్దం’ సెట్స్‌పైకి వెళ్లినా – పూర్త‌యి, ఓటీటీ ద్వారా విడుద‌ల అవ్వ‌డానికి ఇంత‌కాలం ప‌ట్టింది. ఈ సినిమా అనుష్క‌ని మ‌ళ్లీ రేసులోకి తెస్తుంద‌నుకుంటే… ఇదే త‌న‌కు అతి పెద్ద మైన‌స్ గా మారే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. పోస్టరు పై మాధ‌వ‌న్‌, అంజ‌లి లాంటి తార‌లు క‌నిపిస్తున్నా, ఇది అనుష్క సినిమాగానే ప్ర‌చారం జ‌రుపుకుంది. అమేజాన్ ప్రైమ్ ఈ సినిమా అంత రేటు పెట్టి కొన్న‌దంటే దానికి కార‌ణం అదే. మొత్తానికి కాస్త లేట్ అయినా, బొమ్మ బ‌య‌ట‌కు వ‌చ్చింది. తీరా చూస్తే – అనుష్క కెరీర్‌కి ఇదే పెద్ద ప్ర‌తిబంధ‌కంగా మారిపోయింది.

అనుష్క ఈ సినిమాలో చాలా లావుగా క‌నిపించింది. అనుష్క‌ని, ఆమె పాత్ర‌ని ద‌ర్శ‌కుడు స‌రైన రీతిలో వాడుకోలేక‌పోయాడు కూడా. పైగా న‌టిగా అనుష్క చేసిందేం లేదు. అనుష్క ప్ల‌స్ పాయింట్స్ సైతం తెర‌పై స‌మ‌ర్థ‌వంతంగా ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. ఈ మైన‌స్సుల‌న్నీ అనుష్క ఖాతాలో ప‌డిపోయాయి. బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క స్లిమ్ అవ్వ‌డానికి ప్ర‌య‌త్నించింద‌ని, బ‌రువు త‌గ్గింద‌ని వార్త‌లొచ్చాయి. అయితే… ‘నిశ్శ‌బ్దం’లో అవేం రిఫ్లెక్ట్ కాలేక‌పోయాయి. ఒక‌ప్పుడు లేడీ ఓరియెంటెడ్ క‌థ‌లకు అనుష్కనే పెద్ద దిక్కు. ఇప్పుడు అలా కాదు. స‌మంత‌, కీర్తి సురేష్ లాంటి వాళ్లు పోటీకి వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఒక్క ఫ్లాపు చాలు కెరీర్ తారుమారు అవ్వ‌డానికి, అవ‌కాశాలు చేజార‌డానికి.

`బాహుబ‌లి` త‌ర‌వాత స్వీటీ కావాల‌నే బ్రేక్ తీసుకుంది. కొన్ని రోజుల పాటు ఇంటికే ప‌రిమిత‌మైంది. వ్య‌క్తిగ‌త జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ సినిమాల్ని ఒప్పుకుంటోంది. ప్ర‌స్తుతం త‌న చేతిలో రెండు సినిమాలున్నాయ‌ని అనుష్క ప్ర‌క‌టించింది. మ‌రి కొన్ని క‌థ‌లు `నిశ్శ‌బ్దం` రిజ‌ల్ట్ గురించి వెయిటింగ్‌. చేతిలో ఉన్న సినిమాల సంగ‌తి స‌రే. రావాల్సిన సినిమాలు మాత్రం `నిశ్శ‌బ్దం` త‌ర‌వాత సైడ్ అయిపోతే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికైనా త‌న కెరీర్‌పై, ఎంచుకునే క‌థ‌ల‌పై, అంత‌కంటే ముఖ్యంగా శ‌రీరాకృతిపై అనుష్క దృష్టి పెడితే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

పల్నాడులో కీల‌క ప‌రిణామం- అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్

హింసాత్మక ఘటనలతో విధ్వంసకాండ కొనసాగుతోన్న పల్నాడు జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ఆయన సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్ళారు. గురువారం గృహ నిర్బంధంలోనున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాత్రి...

ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేసిన నాగబాబు… ఆ ట్వీటే కారణమా..?

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు అనూహ్యంగా ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సడెన్ గా ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది ఆసక్తి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close