ఎక్కువ సీట్లు ఉన్నా సీఎం సీటు బీజేపీ త్యాగం చేస్తుందా..!?

బీహార్ ఎన్నికల పోరు రసరవత్తరంగా సాగుతోంది. కాంగ్రెస్, ఆర్జేడీ ఓ కూటమిగా.. బీజేపీ, జేడీయూ మరో కూటమిగా కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ రెండు కూటముల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ, జేడీయూ తరపున ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ పేరే అందరూ చెబుతున్నారు. హోంమంత్రి అమిత్ షా కూడా అదే చెబుతున్నారు. బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ.. నితీషే సీఎంగా ఉంటారని చెప్పుకొచ్చారు. బీహార్‌లో ఉన్న అసెంబ్లీలో చెరో సగం పంచుకున్నాయి. ఒక్క స్థానంలో జేడీయూ ఎక్కువ పోటీ చేస్తోంది. కానీ ఇతర చిన్న మిత్రపక్షాలకు కొన్ని సీట్లు వదిలేయాల్సి వచ్చింది. అందుకే.. ఎన్నికల తర్వాత సీఎం ఎవరు అనేదానిపై చర్చ ప్రారంభమయింది.

బీజేపీకి ఎక్కువ సీట్లు లభిస్తే.. జేడీయూకు చెందిన నితీష్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. ఇది ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఎక్కువ చర్చ జరిగితే.. తమ కూటమికి నష్టం అని బీజేపీ రంగంలోకి దిగింది. తమకు ఎక్కువ సీట్లు వచ్చినా నితీష్ కుమారే సీఎం అని చెప్పడం ప్రారంభించారు. కానీ నిజంగా బీహార్ ఎన్నికల్లో బీజేపీ – జేడీయూ కూటమి గెలిచి.. బీజేపీకి ఎక్కువ సీట్లు నితీష్ కుమార్‌కు సీఎం సీటివ్వడం అంత ఈజీ కాదు. ఒక వేళ ఇచ్చినా ఆరు నెలల్లో సీన్ మారిపోతుంది. బీహార్ కు బీజేపీ ముఖ్యమంత్రి వచ్చే అవకాశాన్ని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు.

2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశారు. భారీ విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. లాలూను జైలుకు పంపేసి… ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఈ విషయం ప్రస్తుతం సీఎం నితీష్ .. ఆర్జేడీకి షాకిచ్చారు. అవినీతి ఆరోపణలు చేసి ప్రభుత్వం నుంచి లాలూ కుమారుల్ని గెంటేసి…బీజేపీతో చేతులు కలిపేశారు. బీహార్‌లో అధికారంలోకి రావడానికి బీజేపీ పన్నిన ప్లాన్ అది. అంతగా బీహార్‌లో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ .. సీఎం సీటు వస్తే వదులుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడెన్ని మాటలు చెప్పినా… ఎన్నికల ఫలితాల తర్వాతే అసలు రాజకీయం ప్రారంభమవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close