ఇండియాలో 30 శాతం మందికి వైరస్ వచ్చిపోయిందట..!

భారత్‌లో కరోనా వైరస్ పీక్ స్టేజ్‌లో ఉందని .. ఇప్పటికి దేశంలో 30 శాతం మందికి కరోనాను తట్టుకునే యాంటీ బాడీస్ అభివృద్ధి అయ్యాయని.. కేంద్రం నియమించిన కమిటీ తేల్చింది. అంటే.. భారత్ ఇప్పటికే పీక్ స్టేజ్ దాటిపోయిందని అర్థం అని కేంద్రం చెబుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా.., కరోనా ప్రభావం దేశంలో అత్యంత తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సీరో సర్వైలెన్స్ సర్వేల ద్వారా దేశంలో పాతిక శాతం మందికిపైగా కరోనా సోకి పోయినట్లుగా గుర్తించారు. ఇప్పుడు ఆ సంఖ్య మరింతగా పెరిగింది. ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్‌లో పెద్ద ఎత్తున లక్షణాలు లేని కరోనా సోకిన వారు ఎక్కువగానే ఉన్నా… మృతుల సంఖ్య మాత్రం ప్రమాదకరంగా లేదు.

ప్రస్తుతం దేశంలో రోజుకు అరవై, డెభ్బై వేల కేసుల వరకూ నమోదవుతున్నాయి. అయితే ఈ కేసులన్నీ .. ఐదు రాష్ట్రాల్లోనే ఎనభై శాతం వరకూ నమోదవుతున్నాయి. అదే సమయంలో.. ట్రీట్‌మెంట్ విషయంలో కూడా గతంలోలా హడావుడి చేయడం లేదు. ప్రభుత్వాలు కూడా నిర్బంధ వైద్యాన్ని దాదాపుగా ఆపేశాయి. కరోనా వల్ల లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని మాత్రమే ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నారు. మిగతా వారిని ఇంటి వద్దనే ఉండమని సలహాలిస్తున్నారు. కొన్ని ప్రభుత్వాలు వారికి మెడిసిన్స్ సరఫరా చేస్తున్నాయి.. చాలా ప్రభుత్వాలు పట్టించుకోవడం మావేశాయి. ప్రజలు కూడా.. లక్షణాలు కనిపిస్తే.. టాబ్లెట్ తెచ్చి వేసుకుటున్నారు కానీ టెస్టుల వరకూ వెళ్లడం లేదు.

కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్నప్పటికీ.. అన్ లాక్ చేసేయడంతో ప్రస్తుతం దేశంలో ప్రజాజీవనం సాధారణ స్థితికి వచ్చింది. ఎప్పటిలానే అన్ని వ్యాపార వ్యవహారాలు నడుస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి సాధారణ స్థితికి వస్తోంది. ఇక నుంచి మళ్లీ పీక్ స్టేజ్‌కి వెళ్లే పరిస్థితి ఉండదని… కేంద్రం భావిస్తోంది. దానికి తగ్గట్లుగానే.. ఇప్పటికే పీక్ స్టేజ్ దాటిపోయిందనే ప్రకటనలు వస్తున్నాయని అనుకోవచ్చు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘మిరాయ్’ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌

'హ‌నుమాన్‌' త‌ర‌వాత తేజా స‌జ్జా నుంచి వ‌స్తున్న సినిమా 'మిరాయ్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని షాట్స్,...

ఓటమి భయం… ఏపీలో వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..!?

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని...

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

వంద కోట్ల వెబ్ సిరీస్ ఏమైంది రాజ‌మౌళీ?!

బాహుబ‌లి ఇప్పుడు యానిమేష‌న్ రూపంలో వ‌చ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే 'బాహుబ‌లి' సినిమాకీ ఈ క‌థ‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఆ పాత్ర‌ల‌తో,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close