ఏపీలోకి “చుక్క” కూడా తీసుకెళ్లలేరు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు మద్యం బాటిళ్లను తీసుకెళ్లే వెసులుబాటును రద్దు చేసింది. ఈ మేరకు ప్రత్యేకంగా జీవో తీసుకు వచ్చింది. ఏపీలోకి పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎలాంటి మధ్యం తీసుకు రావడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం మద్యం విధానాన్ని మార్చేశారు. అప్పుడు కూడా.. ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. కానీ.. జీవో జారీ చేసే సమయంలో.. ‌అవగాహనా రాహిత్యంతో వ్యవహిరంచడంతో మందుబాబులు దాన్ని తమకు అనుకూలంగా మల్చుకున్నారు. ఎవరైనా మూడు లీటర్ల మద్యాన్ని ఉంచుకోవచ్చని.. రవాణా చేసుకోవచ్చని.. ప్రభుత్వం జీవోలో చెప్పింది. అది ఎక్కడి మద్యం అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

అయినప్పటికీ.. ఒక్క బాటిల్ తెచ్చుకుంటున్నా పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. దీనిపై వారంతా కోర్టుల్లో కేసులు వేశారు . ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే.. తాము… మద్యం తెచ్చుకుంటున్నా కేసులు వేస్తున్నారని వారు వాదించారు . జీవోను పరిశీలించిన హైకోర్టు.. జీవో ప్రకారం మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చంటూ పర్మిషన్ ఇచ్చింది. అప్పటి నుండి… ఏపీలోకి మూడు మద్యం బాటిళ్లు తీసుకెళ్లేవాళ్లు ఎక్కువైపోయారు.

ప్రభుత్వం ఈ నిబంధనను మార్చడానికి ప్రత్యేకంగా జీవో తేవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికి ఆ జీవో విడుదలైంది. కొసమెరుపేమిటంటే… విదేశాల నుంచి మాత్రం.. మద్యం తెచ్చుకోవచ్చు. దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం… విదేశాల నుంచి తెచ్చుకునే మద్యాన్ని ఏపీలోకి అనుమతిస్తారు. కానీ పొరుగురాష్ట్రాల పెయిడ్ లిక్కర్‌ను మాత్రం… అనుమతించరు. దొరికితే కేసులు పెడతారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close